ఈ వారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీసు దగ్గరరసవత్తరమైన పోటీ చూసే అవకాశం దక్కింది. తొలి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకొన్న `లై` కాస్త వెనకబడితే - నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక వసూళ్ల వేటలో పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. తొలి వారాంతంలో నేనే రాజు నేనే మంత్రి రూ.8.5 కోట్లు వసూలు చేసింది. కాస్త వెనకబడిన జయ జానకి నాయక రూ.8 కోట్లతో సరిపెట్టుకొంది. అయితే బడ్జెట్ - సాధించిన వసూళ్లు రెండూ బేరీజు వేసుకొంటే . నేనే రాజు నేనే మంత్రి ముందంజలో ఉన్నట్టు లెక్క. రూ.15 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. శాటిలైట్, తమిళ మార్కెట్ కలుపుకొంటే... ఇప్పటికే ఆ సినిమా లాభాల్లో ఉన్నట్టు లెక్క. జయ జానకి కి మాత్రం రూ.35 కోట్లకు పైనే అయ్యింది.