రాజు యాదవ్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: రాజు యాదవ్

నటీనటులు: గెటప్ శ్రీను, అంకిత ఖరత్

దర్శకత్వం: కృష్ణమాచారి. కె
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి
 
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
ఛాయాగ్రహణం: సాయిరామ్ ఉదయ్ D.F.Tech
కూర్పు: బొంతల నాగేశ్వర రెడ్డి

బ్యానర్స్: సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ: 24 మే 2024

 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5


టాలీవుడ్ కమెడియన్స్ ఒక్కొక్కరుగా హీరోలుగా మారుతున్నారు.  కొత్త తరంలో  సుడిగాలి సుధీర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ, అభినవ్ గోమఠం లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో గెటప్ శ్రీను కూడా చేరాడు. శ్రీను జబర్దస్త్ షో తో మంచి పేరు తెచుకున్నాడు. రామ్ ప్రసాద్, శ్రీను , సుధీర్ కాంబోలో జబర్దస్త్ లో స్కిట్స్ చేసి, కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. తరవాత వీరు ముగ్గురు కలిసి త్రీ మంకీస్ అనే సినిమా చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకి గెటప్ శ్రీను సోలో హీరో గా 'రాజు యాదవ్' అనే సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా, శ్రీను హీరోగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం.    


కథ: రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ది మహబూబ్ నగర్.  రాజు తండ్రి ఆనంద చక్రపాణి  డ్రైవర్. తనలా కొడుకు కష్ట పడకూడదని బాగా చదివిస్తాడు. కానీ రాజు డిగ్రీ కూడా పాస్ అవడు. నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యి  ఖాళీగా తిరుగుతుంటాడు. ఒక రోజు  స్నేహితులతో కలిసి  క్రికెట్ ఆడుతుండగా బాల్ తగిలి ఫేస్ డ్యామేజ్ అవుతుంది. దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను కుట్లు వేస్తాడు. ఆ ఆర్ఏంపి డాక్టర్ వేసిన కుట్లు వలన రాజు ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండేటట్లు మారిపోతుంది. ఆపరేషన్ చేయకపోతే ఫేస్ ఎప్పటికి అలాగే ఉండిపోతుంది అని డాక్టర్లు చెప్తారు. ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చు అవుతాయి అని తెలిసి అంత  డబ్బు లేకపోవడంతో అలాగే ఉండిపోతాడు రాజు. అక్కడి నుంచి శ్రీను లైఫ్ మారిపోతుంది. కష్టాల్లో పడతాడు.  ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఎదో గొడవ అయితే  పోలీస్ స్టేషనుకు వెళ్తాడు రాజు, అక్కడ   హీరోయిన్ స్వీటీ (అంకితా కరాత్) కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలోపడతాడు. స్వీటీ మొదట్లో పట్టించుకోకపోయినా తరవాత రాజు తో స్నేహం చేస్తుంది. కొన్నాళ్ళకి  హైదరాబాదులో ఉద్యోగం వచ్చిందని స్వీటీ వెళ్ళిపోతుంది. తనని వదిలి ఉండలేక రాజు కూడా హైదరాబాద్ కి వస్తాడు. రాజు హైదరాబాద్ వెళ్లి స్వీటీని కలిశాడా? హైదరాబాద్ లో రాజు ఏం చేశాడు? స్వీటీతో ప్రేమ సఫల మైందా? చివరికి రాజు ఆపరేషన్ చేయించుకున్నాడా? అతని లాఫింగ్ ఫేస్ వలన వచ్చిన సమస్యలు? రాజు తల్లిదండ్రులు ఏమయ్యారు, వారి కష్టాలు ఏంటి? స్వీటీ హైదరాబాద్ కి వెళ్లి ఏం చేస్తుంది అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే. 


విశ్లేషణ: కథ పాతదే అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. ముఖానికి దెబ్బ తగిలి మారిపోవటం, లాఫింగ్ ఫేస్ తో నిత్యం ఉండటం కొంచెం కొత్త గా ఉంది. కొన్ని సీరియస్ విషయాలకి నవ్వుతూ ఉండటం వలన రాజు యాదవ్ పడే ఇబ్బందులు అన్నీ నవ్వు తెప్పిస్తాయి. జబర్దస్త్ లో శ్రీను కామెడీ టైమింగ్ ని ఎంజాయ్ చేసి, అందుకోసం వెళ్లే వారిని డిసప్పాయింట్ చేయకుండా కొన్ని సీన్లు ఉన్నాయి. శ్రీను కొన్ని సందర్భాల్లో నవ్విస్తూ, కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తూ చక్కటి నటన కనపరిచాడు. కానీ కథలో కొత్త దనం లేకపోవటం, హీరోయిన్ పాత్ర ఇంతకముందు వచ్చిన సినిమాలకి దగ్గరగా ఉండటం మైనస్. ఇదే కథాంశం తో వచ్చిన RX 100  అప్పటికి కొత్త కథ కనుక హిట్ అయింది. అలాగే బేబీ సినిమా కూడా ఇంచు మించు అలాంటి కథే అయినా కొంచెం మలుపులు, ఎమోషన్స్ తో  ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ఆ కథని చాలా మంది యూత్  ఓన్ చేసుకున్నారు. రాజు యాదవ్ సినిమా కూడా ఈ రెండు సినిమాల్ని తలపిస్తుంది. కానీ అంతగా ఆకట్టుకునే విషయాలు, ప్రేక్షకుల గుర్తు పెట్టుకునే సీన్స్ ఏం లేవని చెప్పొచ్చు. 


హీరోకి ఫ్యామిలీ తో ఎక్కువ అనుబంధం ఉన్నట్టు కూడా చూపించటం లో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. లవ్  సీన్స్ కూడా ఆసక్తిగా, కొత్తగా లేవు. అదే రొటీన్ కథ, చివరికి ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించ గలడు. హీరోయిన్ పై మొదటినుంచి ఒక డౌట్ మొదలవుతుంది. నిజంగా రాజుని ప్రేమిస్తుందా అని, అదే నిజం చేస్తూ కథ ముగుస్తుంది.  ఫస్ట్ హాఫ్ అంతా రాజు  హీరోయిన్ వెంట పడటం, రాజు లాఫింగ్ ఫేస్ తో వచ్చే  కష్టాలు. సెకండ్ హాఫ్ రాజు హైదరాబాద్ కి వచ్చాక ఏం జరిగింది అనేది మొత్తంసినిమా. ఒక చిన్న కాన్సెప్టు తో రెండు గంటల సినిమాకి సరిపడా సీన్స్ రాసుకుని ప్రేక్షకుడ్ని ఆకట్టుకోవటమంటే అంత సులభం కాదని రాజు యాదవ్ మరోసారి రుజువు చేసింది. 


నటీనటులు: గెటప్ శ్రీను నుంచి ఏం ఆశించి వెళ్తారో అది దొరుకుతుంది. అదీ ఇంచు మించు జబర్దస్త్ తరహాలో. అక్కరకు రాని ప్రయోగాలు జోలికి పోకుండా, హీరోయిజం ఓవర్ గా ఎలివేట్ చేయకుండా న్యాచురల్ గా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు శ్రీను. తనకి సరిపోయే కథని ఎంచుకున్నాడు. రొమాన్స్, ఎమోషనల్ సీన్స్ లో కూడా నవ్వుతూ నటించి మెప్పించాడు. తన పాత్ర పరిధి వరకు పరవాలేదనిపించాడు. కథలో కొత్తదనం లేకపోవటం తన చేతుల్లో లేదు. హీరోగా తనకి వచ్చిన  అవకాశం వినియోగించుకున్నాడు. హీరోయిన్ అంకిత నటన కూడా బాగుంది. తన పాత్రకి తాను న్యాయం చేకూర్చింది. మోడ్రన్ గా కనిపించి మెప్పించింది. మిగతా పాత్రలకి పెద్దగా స్కోప్ లేదు. కథ మొత్తం  ఈ రెండు పాత్రల చుట్టూ తిరుగుతుంది. 


టెక్నికల్: సినిమా లొకేషన్స్ అన్ని న్యాచురల్ గా తెరకెక్కించారు. హంగు ఆర్భాటాలు కనిపించవు. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , విజువల్స్  బాగున్నాయి. హర్ష వర్ధన్  స్వరపర్చిన పాటలు బాగున్నాయి. చంద్ర  బోస్, కాసర్ల శ్యాం మంచి సాహిత్యాన్ని అందించారు.

 

ప్లస్ పాయింట్స్
సంగీతం
విజువల్స్  
గెటప్ శ్రీను 


మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
బలం లేని సన్నివేశాలు 


ఫైనల్ వర్దిక్ట్ : పాత కథ కొత్త హీరో...


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS