'కరోనా' బాంబ్‌ పేల్చిన సెక్స్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌!

మరిన్ని వార్తలు

ఏదో ఒక రకంగా వివాదాల్లో ఉండాలనుకునే సెక్సీ బాంబ్‌ రాఖీ సావంత్‌ తాజాగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసింది. అబ్బో ఈ సారేం చేసిందా ఈ మహాతల్లి.. అనుకుంటున్నారా.? అయితే అర్జంటుగా మీకు వివరాలు తెలియాల్సిందే. రాఖీ సావంత్‌ చైనాకి వెళ్తోందట. అదేంటీ రాఖీకి పిచ్చి గానీ పట్టిందా? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, మరోసారి ఇదే మాట అనుకోవాల్సి వస్తుంది మరి. చైనాని అల్ల కల్లోలం చేస్తున్న కరోనా ఆట పట్టించడానికే రాఖీ సావంత్‌ చైనా ప్రయాణం కట్టిందట.. ఇప్పుడు మళ్లీ సేమ్‌ డైలాగ్‌ వేసుకుంటున్నారా? మరదే అందుకే ముందే చెప్పింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

ఇంతకీ కరోనాని మట్టు పెట్టడానికి రాఖీ తలపెట్టబోతోన్న ఆ ఆపరేషన్‌ ఏంటటా? చైనాకెళ్లి జింగిల్‌ బెల్స్‌ అంటూ, తన క్లీవేజ్‌ పర్‌ఫామెన్స్‌ ఏమైనా ఇవ్వబోతోందా.? అంటే ఏమో తెలీదు కానీ, కరోనా వైరస్‌కి తాను ఏమాత్రం భయపడనంటోంది. అంతేకాదు, అమెరికాలోని నాసాకు వెళ్లి కరోనాకి మందు తెస్తుందట. రాఖీ సావంత్‌ కామిడీ గీమిడీ చేయడం లేదు కదా.. ఊరుకోండి మీరు మరీను. రాఖీ సావంత్‌ చాలా సీరియస్‌గా చెప్పేసి చైనాకి బయలుదేరింది. ఇవన్నీ ఉత్త మాటలు అనుకుంటున్నారా.? కావాలంటే మీరే చూడొచ్చు.. చైనాకి వెళ్లే ఫ్టైట్‌లోంచి ఓ సెల్ఫ్‌ వీడియో షూట్‌ చేసి షేర్‌ చేసింది. యాజ్‌ యూజ్‌వల్‌ రెడ్‌ హాట్‌ డ్రస్‌లో కనిపిస్తోంది ఈ వీడియోలో రాఖీ. అన్నట్లు ఈ పతివ్రతా శిరోమణి పద్ధతిగా మెడలో నల్ల పూసలు కూడా ధరించిందండోయ్‌. అది మాత్రం గమనించడం మర్చిపోకండే. గతేడాది ఈ హాటీ హాట్‌ హాట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలుసనుకుంటా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS