కండోమ్స్‌ గిఫ్ట్‌గా ఇస్తానంటోంది

మరిన్ని వార్తలు

కొత్తగా పెళ్లయిన వాళ్ల వద్దకు వెళ్లేటప్పుడు గిఫ్ట్స్‌ తీసుకెళ్లడం సర్వ సాధారణ విషయమే. అయితే ఎలాంటి గిఫ్ట్స్‌ ఇవ్వాలనే అంశంలో కొంచెం కొత్తగా ఆలోచించింది బాలీవుడ్‌ ఐటెం బాంబ్‌ రాఖీ సావంత్‌. 

ఇటీవలే బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ, క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త జంటకి గిఫ్ట్‌గా మన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్‌ ఇవ్వబోయే గిఫ్ట్‌ ఏంటో తెలుసా? 'కండోమ్‌'. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. కండోమ్స్‌ని ఈ న్యూ కపుల్‌కి గిఫ్ట్‌గా ఇస్తానంటోంది రాఖీ సావంత్‌. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ రాఖా సావంత్‌ ఓ కండోమ్‌ బ్రాండ్‌కి ప్రచార కర్తగా పని చేస్తోంది. ఆ కండోమ్స్‌నే విరాట్‌కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులకు గిఫ్ట్‌గా ఇస్తానంటోంది. 

ఈ వార్త ఇప్పుడు అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుందని.. రాఖీ సావంత్‌పై పలు విమర్శలున్నాయి. అయితే ఆమె వెర్షన్‌ మరోలా ఉంది ఈ విషయంలో. 'ఇందులో తప్పేముంది. ఇదేం బూతు కాదు. ఆరోగ్యకరమైన శృంగార జీవితానికి అది తప్పనిసరి. అది లేకపోతే దేశమంతా ఎయిడ్స్‌తో నిండిపోతుంది..' అని రాఖీ సావంత్‌ అంటోంది. అందుకే నా తరపున విరాట్‌ - అనుష్కలకు గిఫ్ట్‌గా నేను కండోమ్స్‌ ఇస్తాను.. అని చెబుతోంది. 

అంతేకాదు చాలా ఫ్లేవర్స్‌లో లభ్యమవుతున్నాయివి. వీటి పట్ల అవగాహన పెరగాలి అని చెప్పింది రాఖీ సావంత్‌. ఇక్కడితో ఆగలేదండోయ్‌ ఈ బ్యూటీ, రామ్‌దేవ్‌ బాబాను కూడా టచ్‌ చేసింది. ఎలాగంటారా? అన్ని ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోన్న రామ్‌దేవ్‌బాబా కండోమ్స్‌ని కూడా తీసుకు రావాలి. అవి బాగా సేల్‌ అవుతాయి.. అని చెప్పింది. 

బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించింది రాఖీ సావంత్‌. తెలుగులోనూ అప్పుడెప్పుడో ఓ ఐటెం సాంగ్‌ చేసింది. 'రాఖీ కా స్వయంవర్‌' అనే ఓ రియాల్టీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకుందీ హాట్‌ ఐటెం బాంబ్‌. ఆ షోలో విన్‌ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంది. కానీ తర్వాత సింపుల్‌గా హ్యాండిచ్చింది రాఖీ సావంత్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS