టైగర్ జిందా హై కలెక్షన్స్ చూసి షాక్ అవ్వాల్సిందే

మరిన్ని వార్తలు

సల్మాన్ ఖాన్-కత్రినాకైఫ్ లు జంటగా నటించిన టైగర్ జిందా హై చిత్రం కలెక్షన్స్ పరంగా ఆయన గత చిత్రాల రికార్డులని తిరగరాస్తూ దూసుకపోతున్నది.

ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో సుమారు రూ 152 కోట్లు కొల్లగొట్టింది. దీనితో ఈయన గత చిత్రం సుల్తాన్ నెలకొల్పిన రికార్డుని ఈ సినిమా బద్దలుకొట్టింది. ఇక కలెక్షన్స్ చూస్తే, నాల్గవ రోజు క్రిస్మస్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ కి మరింత ఊపునిచ్చింది.

నాల్గవ రోజు అయిన నిన్న దాదాపుగా రూ 36- 37 కోట్లు వసూళ్ళు సాదించడంతో రూ 150 కోట్ల మార్కుని సునాయాసంగా దాటాగలిగింది. టైగర్ జిందా హై చిత్రం కేవలం ఇండియాలోనే నాలుగు రోజుల్లో రూ 150కోట్ల మార్కు దాటడం ఇక ప్రపంచవ్యాప్తంగా రూ 200కోట్లు దాటడంతో ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలుకోట్టనుంది అని అర్ధమవుతున్నది.

ఈ కలెక్షన్స్ హవా చూస్తూ అందరు అంటున్న ఒకే మాట- సల్లు భాయ్ గ్రేట్ అని.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS