తూచ్‌.! రాఖీ సావంత్‌ పెళ్లి ముచ్చట అంతా ఉత్తదే!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో పుణ్యమా అని, ఫోటోస్‌ని బట్టి, సిట్యువేషన్స్‌ని వేడి వేడిగా సిద్ధం చేసేస్తున్నారు నెటిజన్లు. అలా తాజాగా బాలీవుడ్‌ ఐటెం బాంబ్‌ రాఖీసావంత్‌ పెళ్లి ముచ్చట ఈ మధ్య వైరల్‌ అయ్యింది. ఇంకేముంది రాఖీసావంత్‌ సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకుందంటూ డేట్‌తో సహా వైరల్‌ చేసేశారు. ఈ నెల 28న రాఖీ వివాహం ఓ ఎన్నారైతో జరిగిందనేది ఈ వైరల్‌ న్యూస్‌ సారాంశం. అయినా, పబ్లిసిటీ అంటే పిచ్చ మోజున్న రాఖీ సావంత్‌ విషయంలో ఈ వైరల్‌ న్యూస్‌ ఏమైనా న్యాయంగా ఉందా.. చెప్పండి.

 

నిజంగానే పెళ్లి చేసుకుంటే, ఈ హాట్‌ ఐటెం పోరీ, తన ఇస్టైల్‌లో చెప్పకుండా ఉంటుందా? ఈ చిన్న లాజిక్‌ని నెటిజన్స్‌ మిస్‌ అయ్యారు. ఆమె పెళ్లి వార్తతో అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసేశారు. కానీ, లేటెస్ట్‌గా రాఖీ సావంత్‌ ఈ విషయంపై స్పందించింది. నాకు పెళ్లి కాలేదు.. ఈ వార్తలన్నీ, జస్ట్‌ గాసిప్స్‌ మాత్రమే అని కొట్టి పారేసింది. ఓ హోటల్‌ ఓపెనింగ్‌ సందర్భంగా రాఖీ సావంత్‌ ట్రెడిషనల్‌ బ్రైడల్‌ డ్రస్‌లో దర్శనమిచ్చింది.

 

ఆ ఫోటో చూసి, నెటిజన్లు ఇలాంటి పుకార్లు పుట్టించేశారు. సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన ఫేమ్‌ కన్నా, ఇలాంటి హాట్‌ న్యూస్‌ ద్వారా రాఖీ సావంత్‌కి వచ్చిన ఫేమే ఎక్కువని చెప్పాలేమో. అప్పుడప్పుడూ ఆమెకు గుర్తొచ్చినప్పుడల్లా ఏవో ఒక పబ్లిసిటీ స్టంట్స్‌ చేసే రాఖీసావంత్‌ పేరు తాజాగా ఇలా హాట్‌ టాపిక్‌ అయ్యింది. మొత్తానికి రాఖీ క్లారిటీతో, ఆమె ఇంకా సింగిలే అని కన్‌ఫామ్‌ అయిపోయిందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS