అఖిల్‌ 'బొమ్మరిల్లు'లో ఆడి పాడేది నీవేనా.. ప్రియా!

మరిన్ని వార్తలు

అఖిల్‌కి జోడీ దొరికిందా.? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అక్కినేని అఖిల్‌ నాలుగో చిత్రం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం చాలా వరకూ షూటింగ్‌ జరిగిపోయింది. హీరోయిన్‌ కోసం వెతికి, వెతికి, జాప్యం ఎక్కువ కావడంతో హీరోయిన్‌ లేకుండానే మెయిన్‌ సీన్స్‌ చిత్రీకరణ సాగించేశారు. ఈ సినిమా కోసం బాలీవుడ్‌ భామ అలియాభట్‌ని తీసుకోవాలన్నది అఖిల్‌ కోరిక. కానీ, ఆ కోరిక ప్రస్తుతానికి తీరేలా కనిపించడం లేదు.

 

బాలీవుడ్‌లో బిజీగా సినిమాలు చేస్తూనే, తెలుగులో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో చరణ్‌కి జోడీగా నటిస్తోంది అలియా. ఈ తరుణంలో ఆలియా డేట్స్‌ దొరకడం కష్టమేనని భావించిన అఖిల్‌ అండ్‌ టీమ్‌, తన సినిమా కోసం మరో కొత్త భామని ట్రై చేశారట. ఆ క్రమంలో ఆల్రెడీ నానితో 'గ్యాంగ్‌లీడర్‌' సినిమాలో నటిస్తున్న ప్రియాంక మోహన్‌ వైపు అఖిల్‌ దృష్టి మళ్లడంతో, దాదాపు ఈ భామనే అఖిల్‌ సినిమా కోసం ఫిక్స్‌ చేశారనీ తెలుస్తోంది.

 

త్వరలోనే ప్రియాంక మోహన్‌ సెట్‌లోకి అడుగుపెట్టనుందనీ తాజాగా అందుతోన్న సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, హమ్మయ్యా అఖిల్‌కి జోడీ కుదిరినట్లే అనుకోవాలి. జీఏ 2 పిక్చర్స్‌ బ్యానర్‌లో బన్నీవాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కూల్‌ కమర్షియల్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS