'రక్షకుడు' - 'రాక్షసుడు' బీ రెడీ ఫర్‌ 'ఎంట్రీ'!

మరిన్ని వార్తలు

డైరెక్టర్‌ అవ్వాలని వచ్చిన కుర్రోడ్ని యాక్టర్‌గా ఫిక్స్‌ చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ. డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌గా సెటిలైపోయిన ఆ కుర్రోడు నాని. 'అష్టా చెమ్మా' సినిమాతో నానిని హీరోగా పరిచయం చేశాడు ఇంద్రగంటి. తొలి సినిమాకే నేచురల్‌ స్టార్‌ అనిపించుకున్నాడు. పక్కింటబ్బాయ్‌ అని పిలిపించుకున్నాడు. ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ దక్కించుకున్నాడు. అలాంటి నానిలోని ఓ డిఫరెంట్‌ యాంగిల్‌ని పరిచయం చేసేందుకు మళ్లీ ఇంద్రగంటి కంకణం కట్టుకున్నాడు. ఇంతవరకూ హీరోగా చూసిన నానిలోని రాక్షసున్ని నిద్ర లేపబోతున్నాడు. అంటే విలనిజం చూపించబోతున్నాడన్న మాట.

 

ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వి' చిత్రం కోసం నాని విలన్‌ అవతారమెత్తబోతున్న సంగతి తెలిసిందే. సుధీర్‌ బాబు హీరోగా నాని విలన్‌గా రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటోంది. ఇంద్రగంటి సినిమాలంటే ఆడియన్స్‌లో ఓ రకమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిపై అంచనాలు పెంచేలా ఈ సినిమా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో సుధీర్‌ బాబు, నానిల ఫస్ట్‌లుక్స్‌ ఎలా ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. వారి క్యూరియాసిటీని అర్ధం చేసుకున్న డైరెక్టర్‌ త్వరలో ఫస్ట్‌లుక్స్‌ రిలీజ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు.

 

ఈ నెల 27న హీరో సుధీర్‌ బాబు లుక్‌ రిలీజ్‌ చేయనున్నారు. 28న అసలు సిసలు విలన్‌ నాని లుక్‌ని రిలీజ్‌ చేస్తారట. ఈ ఇన్‌ఫామేషన్‌ ఇస్తూ సుధీర్‌బాబు, నాని తమదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించారు. 'రాక్షసుడు ఎదిగిన నాడు ఒకడొస్తాడు వాడే రక్షకుడు..' వస్తున్నాడు.. ఈ నెల 27న అంటూ సుధీర్‌ బాబు ట్వీట్‌ చేయగా, 'ఓహో అలాగా సరే ఆ తర్వాతి రోజే నేనూ వస్తున్నా..' అంటూ 28 డేట్‌ రివీల్‌ చేశాడు. ట్వీట్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి వీరి లుక్స్‌ కూడా అలాగే ఉంటాయా.? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS