బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఖాతాలో మరో హిట్ గా నిలిచిన చిత్రం `రాక్షసుడు`. తమిళ రాక్షసన్‌కి ఇది రీమేక్. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. రమేష్ వర్మనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇదే ఆయన తొలి హిందీ చిత్రం అవుతుంది.
కోనేరు సత్యనారాయణ ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈసినిమాని రీమేక్ చేయనున్నారు. ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. `రాక్షసుడు` హిందీలో డబ్ అయి... యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుంటోంది. అయినా సరే, ఈ సినిమాని రీమేక్ చేయడానికి బాలీవుడ్ ఉత్సాహం చూపించడం.. గమనించదగిన విషయమే.