సెప్టెంబరు 5న నాని కొత్త సినిమా `వి` అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. నాని సినిమా ఈరోజే ఎందుకు? అని అడిగితే - ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఇది నానికి చాలా స్పెషల్ డే. ఇంద్రగంటి మోహన కృష్ణకు కూడా. నాని హీరోగా నటించిన మొదటి చిత్రం `అష్టాచమ్మా`. నాని 25వ సినిమా `వి`. అష్టాచమ్మా 2008 సెప్టెంబరు 5నే విడుదలైంది. ఆరతవాత.. నాని కెరీర్ ఎలా పరుగులు తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దర్శకుడిగా ఇంద్రగంటి కెరీర్‌కి రూపు రేఖలు ఇచ్చింది కూడా.. అష్టాచమ్మా సినిమానే. ఆ సినిమా విడుదలైన రోజు.. నాని, ఇంద్రగంటిలకు స్పెషలే కదా. అందుకే.. నాని తన 25వ సినిమానీ అదే రోజున విడుదల చేయాలని ఫిక్సయ్యాడు. థియేటర్లు ఓపెన్ అయ్యి ఉంటే, కరోనా గొడవ లేకపోయి ఉంటే... మార్చిలోనే ఈ సినిమా విడుదలయ్యేది. కానీ.. కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. ఏదైతేనేం.. నానికి అదృష్టం తీసుకొచ్చిన, ఆ లక్కీ డే నే.. ఈసినిమా వస్తోంది.