జాక్ పాట్ కొట్టిన ర‌కుల్‌

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య ర‌కుల్ ప్రీత్ సింగ్ హ‌వా బాగా త‌గ్గిపోయింది. న‌వ‌త‌రం క‌థానాయిక‌ల జోరులో... ర‌కుల్ బాగా వెన‌కబ‌డిపోయింది. హీరోలంతా ర‌కుల్‌తో జోడీ క‌ట్టేశారు. ఇప్పుడు వాళ్లంతా కొత్త భామ‌ల కోసం వెదుకుతున్నారు. అందుకే ర‌కుల్‌ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం మానేశారు.పైగా ర‌కుల్ చేతిలో కూడా హిట్స్ లేవు. అలా.. నెంబ‌ర్ గేమ్ లో వెన‌క‌బ‌డిపోయింది. అయితే ఇప్పుడు ర‌కుల్ జాక్ పాట్ కొట్టింది. ఒక‌టి కాదు.. రెండు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ప‌డ్డాయి. అందునా పెద్ద సినిమాలు. గోపీచంద్ - తేజ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా `అలిమేలు వేంక‌ట‌ర‌మ‌ణ‌`.

 

ఈ చిత్రంలో క‌థానాయిక పాత్ర ర‌కుల్‌ని వరించింద‌ని టాక్‌. నిజానికి ఈ పాత్ర కోసం పెద్ద రీసెర్చే జ‌రిగింది. కాజ‌ల్‌, సాయి ప‌ల్ల‌వి, అనుష్క లాంటి క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికి ర‌కుల్ కి ఓటేశార‌ని టాక్‌. మ‌రోవైపు `క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి` బ‌యోపిక్‌లోనూ ర‌కులే క‌థానాయిక అని తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది.

 

స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార్ట‌. పైగా ర‌కుల్ కి ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. బ‌యోపిక్‌ల‌లో న‌టించాల‌నివుంద‌ని త‌ను చాలాసార్లు చెప్పింది. అలా.. ర‌కుల్ ఈ సినిమాకి మంచి ఆప్ష‌న్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాల‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. రెండు సినిమాలూ ఒకే అయితే... ర‌కుల్ కెరీర్ గాడిన ప‌డ్డ‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS