హీరోలిద్ద‌రూ హ్యాండిచ్చేశారా?

మరిన్ని వార్తలు

హిట్ల మీద హిట్ల‌తో.. జోరు మీదున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కుల‌లో.. అనిల్ రావిపూడి ఒక‌డు. త‌న‌తో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద హీరోలంతా ఎదురు చూస్తున్నారు. త‌న దృష్టంతా ఇప్పుడు `ఎఫ్ 3`పై ఉంది. ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు. అందుకే... లాక్ డౌన్ స‌మ‌యంలో.. ఇంటి ప‌ట్టున ఉండి స్క్రిప్టు పూర్తి చేశాడు. ఇప్పుడు `ఎఫ్ 3` స్క్రిప్టు ప‌క్కాగా సిద్ధ‌మైంది. కానీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల నుంచే గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డం లేదు. వెంక‌టేష్ ప్ర‌స్తుతం నార‌ప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

వ‌రుణ్ తేజ్ చేతిలో మ‌రో సినిమా ఉంది. ఆ రెండూ పూర్త‌వ్వాలి. అప్పుడే.. ఎఫ్ 3 మొద‌ల‌వుతుంది. దానికి తోడు.. వెంక‌టేష్ ఇప్ప‌టికిప్పుడు షూటింగులు మొద‌లు పెట్ట‌డానికి రెడీగా లేడ‌ట‌. కరోనా ఉధృతంగా ఉంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో షూటింగులు చేయ‌డం అంత మంచిది కాద‌ని వెంకీ భావిస్తున్నాడ‌ట‌. అందుకే నార‌ప్ప షూటింగ్ కూడా ఆల‌స్య‌మ‌వుతుంది. అది అవ్వాలి.. అప్పుడు ఎఫ్ 3 మొద‌లవ్వాలి. ఆ స‌మ‌యానికి వ‌రుణ్ కూడా సిద్ధంగా ఉండాలి. ఈ స‌మీక‌ర‌ణాల‌న్నీ క‌లిసి రావ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చాలా క‌ష్టం. చూస్తుంటే హీరోలిద్ద‌రూ అనిల్ రావిపూడికి హ్యాండిచ్చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి అనిల్ ఏం చేస్తాడో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS