ర‌కుల్ నోరు విప్ప‌లేదు.. విప్ప‌దు కూడా!

మరిన్ని వార్తలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి `డ్ర‌గ్‌` బాంబు పేల్చింది. ఈ కేసులోనే రియా చ‌క్ర‌వ‌ర్తి అరెస్ట్ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. రియా మ‌రో 24మంది బాలీవుడ్ సెల‌బ్రెటీల పేర్లు బ‌య‌ట‌పెట్టింద‌ని అందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంద‌ని వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో... తెలుగు చిత్ర‌సీమ షాక్ కి గురైంది. ర‌కుల్ తో పాటు మ‌రికొంత‌మంది టాలీవుడ్ సెల‌బ్రెటీలూ ఈ ఉచ్చులో ఇరుక్కునే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ.. ఇందులో ర‌కుల్ పేరు లేద‌ని, అవ‌న్నీ ఊహాగానాలే అని తేలిపోయాయి. ఇదంతా మీడియా సృష్టి అని తేట‌తెల్లం అయ్యింది. దాంతో.. `రకుల్ పేరు అన‌వ‌స‌రంగా తీసుకొచ్చారు` అని సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారంతా.

 

స‌మంత కూడా ఇదే విష‌యంలో ర‌కుల్‌కి సారీ కూడా చెప్పింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఇష్యూలో ర‌కుల్ నోరు విప్పింది లేదు. త‌న పేరు వ‌చ్చిన‌ప్పుడు, కాద‌ని తెలిసినప్పుడు కూడా ర‌కుల్ మౌనంగానే ఉంది. ఇక మీద‌ట కూడా ఈ విష‌యంలో ర‌కుల్ నోరు విప్ప‌ద‌ని తెలుస్తోంది. డ్ర‌గ్స్ కేసు చాలా సెన్సిటీవ్ విష‌యం. దీనిపై అటు ఇటుగా మాట్లాడితే.. అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డుతుంది. మీడియా అటెన్ష‌న్ అన్ని సంద‌ర్భాల్లోనూ మంచిది కాదు. అందుకే ర‌కుల్ ఈ విష‌యంపై త‌న స్పంద‌న ఇప్ప‌టి వ‌ర‌కూ తెలియ‌జేయ‌లేద‌ని తెలుస్తోంది. పైగా... ఈ కేసు నుంచి ర‌కుల్ ఇంకా బ‌య‌ట‌ప‌డిన‌ట్టు కాద‌ని, త‌న‌కు క్లీన్ చీట్ వ‌చ్చేంత వ‌ర‌కూ ర‌కుల్ మౌనంగానే ఉండ‌డం మంచిద‌ని స‌న్నిహితులు స‌ల‌హా ఇచ్చార్ట‌. అందుకే.. ర‌కుల్ మౌనంగా ఉంద‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS