నేనేమంత ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు మొర్రో!

మరిన్ని వార్తలు

'రెండో మన్మధుడు'తో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిందనే చెప్పాలి. అయితే, ఈ సినిమాపై అంచనాల సంగతి అటుంచితే, ప్రోమోస్‌లో రకుల్‌ బీభత్సమైన ఎక్స్‌పోజింగ్‌ చేయడం నెటిజన్స్‌ని విస్మయానికి గురి చేస్తోంది. మామూలుగా అయితే, ఈ ఎక్స్‌పోజింగ్‌ని పెద్దగా పట్టించుకోరు కానీ, ఇది 'మన్మధుడు 2' సినిమా కావడం, ఈ సినిమాకి దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ కావడం, ఆయన, సోషల్‌ మీడియా ఫెమినిస్ట్‌ చిన్మయికి భర్త కావడం.. ఈ కారణాలతో రకుల్‌ ఇరకాటంలో పడినట్లయ్యింది.

 

చిన్మయి సంగతి తెలిసిందే. అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎత్తి చూపుతూ, అమ్మాయిలను తక్కువ చేసి చూస్తే అస్సలు ఊరుకోలేనన్నట్లుగా, బిల్డప్స్‌ ఇస్తూ, తెగ నీతులు చెప్పేస్తుంటుంది సోషల్‌ మీడియా వేదికగా. ప్లేబ్యాక్‌ సింగర్‌గా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కన్నా, సోషల్‌ మీడియా ఫెమినిస్ట్‌ చిన్మయిగానే ఆమెకు ఎక్కువ పాపులారిటీ దక్కిందనడం అతిశయోక్తి కాదేమో. అదే అనువుగా తీసుకుని, చిన్మయి పేరు చెప్పి, ఇటు రాహుల్‌నీ, అటు రకుల్‌నీ ఇద్దర్నీ ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. అక్కడికీ తానేమంత ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ చేయలేదనీ, కథలో క్యారెక్టర్‌కి తగ్గట్లుగానే అందాలారబోశాను తప్ప, అంతకు మించి ఓవరాక్షన్‌ చేయలేదనీ రకుల్‌ మొత్తుకుంటోంది.

 

ఈ సినిమా రకుల్‌కి ఎంతో కీలకం. హీరోయిన్‌గా తెలుగులో తిరిగి నిలదొక్కుకోవాలంటే, ఈ సినిమా ఖచ్చితంగా పోజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని తీరాలి. కానీ, నెటిజన్స్‌ ఆవేశం చూస్తుంటే, సినిమాలో ఏ చిన్న మిస్టేక్‌ జరిగినా దాన్ని పెద్ద ఇష్యూ చేసేలా కనిపిస్తున్నారు. ఈ నెల 9న 'మన్మధుడు 2' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో సోషల్‌ మీడియాలో ఇంత రచ్చ రంభోలా జరుగుతోంది. మరి, విడుదల తర్వాత ఏం జరుగుతుందో చూడాలిక.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS