ఇస్మార్ట్ స్టైలింగ్‌తో నాగార్జున బిగ్‌బాస్‌కి కొత్త కళ తీసుకొచ్చాడనడం ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. అరవై ఏళ్ల వయసులో ముప్ఫై ఏళ్ల కుర్రోడంటే ఇట్టే నమ్మేస్తారు నాగార్జునని. అందుకే ఆయన్ని అంతా మన్మధుడు అంటారు. బిగ్‌బాస్ హోస్ట్‌గా కూడా నాగార్జున అదే స్టైలింగ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతవరకూ సూట్స్, బ్లేజర్స్‌తో ఆకట్టుకున్న హోస్ట్‌లు, నాగార్జునని చూశాక, అరెరే ఇలాంటి స్టైలింగ్ మేమెందుకు చేయలేదే.. అని జలస్ ఫీలయ్యేలా డ్రస్సులు డిజైన్ చేయించుకుంటున్నాడు నాగ్.
అయితే, నాగ్ ధరించిన లేటెస్ట్ షర్ట్ మాత్రం వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ వీక్ నాగార్జున ఓ కలర్‌ఫుల్ డిజైనర్ టీషర్ట్ ధరించాడు. చూసేందుకు చాలా కలర్‌ఫుల్‌గా, నాగార్జున వయసును సగానికి తగ్గించేసినట్లే ఉంది ఆ షర్ట్. చాలా కళాత్మకంగా ఈ షర్ట్ డిజైన్ చేయించుకున్నాడు నాగార్జున.. అంటూ ప్రశంసలు ఓ పక్క వినిపిస్తుంటే, ఈ షర్టుపై కొన్ని బూతు బొమ్మలున్నాయంటూ ఇంకొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
అయితే, ఇందులో వివాదం లేపకూడదనీ, దాన్ని ఓ కళాత్మక హృదయంతోనే చూడాలని కొందరు అంటున్నారు. కానీ, ఈ వయసులో ఇలాంటి వేషాలేంటి నాగార్జునా..? అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వయసుకు తగ్గ స్టైలింగ్ చేస్తే బావుంటుంది.. అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా నాగ్‌పై ట్రోలింగ్ జరుగుతోంది.