గ్లామ్‌షాట్‌: బికినీలో కాక పుట్టిస్తోన్న రకుల్‌.!

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మరోసారి హాట్‌ ఫోటో షూట్‌తో పిచ్చెక్కించేసింది. అదేదో వెకేషన్‌ ఎంజాయ్‌మెంట్‌ అనుకుంటా.. బికినీ ధరించి బీచ్‌లో ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. ఆ బీచ్‌ వ్యూలోనే కొన్ని ఫోటోలకు పోజిచ్చింది. బ్లూ కలర్‌ బికినీ ధరించి నిటారుగా నిలబడింది. తడి పొడి కురులను నిండుగా ముఖం వరకూ మూసేసి కవర్‌ చేసుకుంది. కళ్లకు సన్‌ గాగుల్స్‌ పెట్టుకుని సైడ్‌కి చూస్తోంది. దూరంగా బ్యాక్‌ గ్రౌండ్‌లో బీచ్‌ కోలాహలం కనిపిస్తోంది.

 

రకుల్‌ మాదిరిగానే చాలా మంది చక్కనమ్మలు అక్కడ టూ పీస్‌ బికినీల్లో సెల్ఫీలకు పోజిచ్చేస్తున్నారు. ఆ తెలియని అందాల సంగతీ మనకెందుకులెండి. మన రకుల్‌ హాట్‌ సోయగాల్ని చూసి ఆస్వాదించండి. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో ఓ సినిమాలోనూ, తెలుగులో నితిన్‌ హీరోగా ఓ సినిమాలోనూ నటిస్తోంది. సినిమా ముచ్చటయితే ఇదే కానీ, గ్లామర్‌ ముచ్చటయితే చాలా ఉంది. ప్రస్తుతానికి మచ్చుకొకింత దీంతో సరిపెట్టుకోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS