రకుల్‌కి ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందా.?

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ అన్నాకా, మొదట్లో కమర్షియల్‌ క్యారెక్టర్స్‌కే పచ్చ జెండా ఊపాలి. వన్స్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ అనిపించుకున్నాక, ఆ తర్వాత ప్రయోగాలకు తెర లేపాలి. ఇదీ టాలీవుడ్‌లో రన్‌ అవుతోన్న హీరోయిన్‌ సిద్ధాంతం ఇన్నాళ్లూ. అయితే, ఈ సిద్ధాంతానికి కొందరు ముద్దుగుమ్మలు సెండాఫ్‌ ఇచ్చేశారనుకోండి. వస్తూ వస్తూనే టాలెంటెడ్‌ క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూ, గ్లామర్‌ కన్నా, టాలెంట్‌ ముఖ్యం.. టాలెంట్‌ ఉన్నోళ్లను కూడా టాలీవుడ్‌ ఎంకరేజ్‌ చేస్తుంది.. అని నిరూపించేశారు. అయితే, ఈ నియమాన్ని కాస్త లేట్‌గా గమనించినట్లుంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పుడు తెగ ఫీయిపోతోంది.

 

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఫుల్‌ బిజీ బిజీగా గడిపిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని ఇప్పుడు ఎంత చేసినా టాలీవుడ్‌ పట్టించుకోవడం లేదు. ‘మన్మధుడు 2’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన రకుల్‌కి చుక్కెదురే అయ్యింది. ఆ తర్వాత ఇదిగో ఇలా పబ్లిసిటీ స్టంట్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది తప్ప, టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్‌ కూడా ఇవ్వడం లేదు మన ఫిలిం మేకర్స్‌. అందుకే కెరీర్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడే అలాంటి క్యారెక్టర్స్‌ ట్రై చేసి ఉండాల్సింది అంటూ రకుల్‌ ఇప్పుడు బాధపడుతోంది. ఏం లాభం.. ఈ జ్ఞానోదయం ఎప్పుడో అయ్యి ఉంటే బావుండేది. బాలీవుడ్‌పై మోజు పడి, టాలీవుడ్‌ని లైట్‌ తీసుకున్న రకుల్‌కి ఆడియన్స్‌ మరీ ఇంత గట్టిగా బుద్ధి చెప్పేశారు. ఏం చేస్తాం. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, తెలుగులో నితిన్‌తో ఓ సినిమా, తమిళంలో మరో సినిమాలోనూ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS