‘క్రాక్‌’ నుండి ‘జయమ్మ’ వచ్చింది చూశారా.?

మరిన్ని వార్తలు

రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్‌’ సినిమాలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె బర్త్‌డే సందర్భంగా, చిత్ర యూనిట్‌ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసింది. ‘జయమ్మ’ అంటూ వరక్ష్మి క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ కాంబోలో జయమ్మ చాలా కోపంగా కనిపిస్తోంది. లుక్‌ చూస్తుంటే, వరలక్ష్మి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని అర్ధమవుతోంది.

 

అఫ్‌కోర్స్‌.. పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్స్‌ అయితేనే వరలక్ష్మి సైన్‌ చేస్తుంనుకోండి. ఇక లుక్‌ విషయానికి వస్తే, బ్లాక్‌ శారీ, మ్యాచింగ్‌ బ్లాక్‌ బెనారస్‌ బ్లౌజ్‌ ధరించింది. మెడలో నల్ల తాడుకు ఓ రుద్రాక్ష వేలాడుతోంది. చెవులకు బ్లాక్‌ మెటల్‌ స్టడ్స్‌ ఉన్నాయి. నుదుటున ఎర్రటి కుంకుమ దాని కింద నల్ల బొట్టు, ముడి వేసిన కొప్పుతో కనిపిస్తోంది. చేతికి రకరకాల తాయెత్తులు కట్టుకుని కనిపిస్తోంది. టోటల్‌గ ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది ఈ లుక్.లో జయమ్మ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS