IPL 2018 సీజన్ ముగిసిందో లేదో అప్పుడే క్రికెట్ బెట్టింగ్ అంటూ ఒక కీలక సూత్రదారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద దొరికిన ఆధారాలతో కొంతమందికి సామాన్లు జారీ చేశారు.
ఆ లిస్టులో బాలీవుడ్ నటుడు-నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్ (సల్మాన్ ఖాన్ తమ్ముడు) కూడా ఉన్నాడు. ఇక విచారణకి హజారైన అర్బాజ్, పోలీసులతో తను బెట్టింగ్ చేశాను అని ఒప్పుకున్నాడు, అయితే ఈ సీజన్ లో మాత్రం బెట్టింగ్ చేయలేదు అని చెప్పాడట. కాకపోతే గత సీజన్ లో ఒక మ్యాచ్ లో బెట్టింగ్ చేసి సుమారు రూ 2కోట్ల 80 లక్షల మేర పోగొట్టుకున్నాను అని చెప్పాడు.
ఇక పోలీసులకి చిక్కిన బుకి సోను జలన్ ని కూడా అర్భాజ్ తో కలిపి విచారణ జరిపిన పోలీసులకి కీలక సమాచారం లభించినట్టు సమాచారం. విచారణ అనంతరం అర్భాజ్ ని పంపించేశారు పోలీసులు, భవిష్యత్తులో ఎప్పుడు విచారణకి పిలిచినా రావాల్సిందిగా చెప్పినట్టుగా తెలిసింది.
ఏదేమైనా... సల్మాన్ ఖాన్ కుటుంబానికి ఈ పోలీసు కేసులతో చాలా ఇబ్బందిగా మారింది అని చెప్పొచ్చు.