ప్రస్తుతం తెలుగులో రకుల్ ప్రీత్‌సింగ్ 'మన్మధుడు 2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపైనే రకుల్ ఆశలన్నీ. ఎంతో కష్టపడి ఈ సినిమాతో రకుల్ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. అందుకే అదే ట్రైల్స్‌లో ఉందిప్పుడు. ఖాళీ దొరికితే చాలు ఇటు నాగార్జుననీ, అటు డైరెక్టర్ రాహుల్ రవీందన్నీ పొగడడమే పనిగా పెట్టుకుంది. తాజాగా 'మన్మధుడు 2' ఆన్ లొకేషన్ ఫోటోని పోస్ట్ చేసి, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కి బిస్కెట్లు వేసింది.
ఫోటో విషయానికొస్తే, మంచంపై కూర్చొని ఉన్న రకుల్‌ని సినిమాటోగ్రాఫర్ సమీర్ తన కెమెరాలో బంధిస్తున్నాడు.ఆ సీన్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు రాహుల్ రవీంద్రన్. ఈ సినిమాలో 'ఎవ్రీ సీన్ లవ్ ఇట్.. అంతే' అంటూ ఈ ఫోటోని రకుల్ పోస్ట్ చేసింది. మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ ఫోటోకి. ఇకపోతే రకుల్ ఓ వైపు 'మన్మధుడు 2' షూటింగ్లో బిజీగా ఉంటూనే బాలీవుడ్లో 'దేదే ప్యార్ దే' సినిమా ప్రమోషన్స్‌లోనూ హుషారుగా పాల్గొంటోంది. సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొనడంలో రకుల్ రూటే సెపరేటు.
ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఉన్న తరుణంలోనూ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొనేది రకుల్. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు టాలీవుడ్లో ఆమె హవా తగ్గింది. వచ్చిన అవకాశంతో ఆ స్టార్‌డమ్‌ని తిరిగి పొందే ప్రయత్నం చేసేందుకు చాలా కష్టపడుతోంది చూడాలి మరి 'మన్మధుడు 2' ఆమెకు ఆ అవకాశం ఇస్తుందో లేదో.!