సినీ ప్రముఖులకి సినిమాలతో పాటు ఇతర వ్యాపకాలుండడం కొత్తేం కాదు. అయితే ఆ వ్యాపకం, లేదా వ్యాపారంలో వారు ఎంత వరకూ రాణించారనేదే ఇంపార్టెంట్. ఆ విషయంలో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌ని టాప్ ప్లేస్‌లో కూర్చోబెట్టొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముద్దుగుమ్మ జిమ్ బిజినెస్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ ఆ జిమ్స్‌లో రకుల్ కూడా ఫిట్నెస్ పాఠాలు చెబుతూ ఉంటుంది. కాగా ఆ బిజినెస్ రకుల్ బిజినెస్ కెరీర్లో సూపర్ హిట్ అయ్యింది. బ్రాంచ్‌ల మీద బ్రాంచ్‌లు ఓపెన్ చేసుకుంటూ పోతోంది ఈ ముద్దుగుమ్మ. ఓ పక్క హీరోయిన్గా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూనే, మరో వైపు బిజినెస్‌లోనూ ఈ స్థాయిలో రాణించడం అంటే చిన్న విషయం కాదు. నటన అంటే తనకెంతో ఇష్టమనీ అందుకే సినిమాలను ఎంచుకున్నానంటోంది. అదృష్టం కలిసి వచ్చి, ఈ రంగంలో ఈ స్థాయికి ఎదగగలిగాను. అయితే సినిమాల్లో ఎప్పుడూ ఇదే రకమైన పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అందుకే నటిని కాకపోతే నేనేంటి? అనే ప్రశ్న నుండి పుట్టిందే ఈ బిజినెస్. ఫిట్నెస్ అనేది ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి. ప్రస్తుతం ఒత్తిడితో కూడుకున్న మన లైఫ్‌కి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు. వాటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఫిట్నెస్ కంపల్సరీ. అందుకే ఈ వృత్తినే తన వ్యాపారంగా ఎంచుకున్నానంటోంది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్. ఈ బిజినెస్ ద్వారా సొసైటీకి ఎంతో కొంత మేలు కలుగుతోందనే ఆత్మ సంతృప్తి మిగులుతోందంటోంది రకుల్. ఇటు సినిమాలు, అటు బిజినెస్ మాత్రమే కాకుండా, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ రకుల్ యాక్టివ్‌గా పాల్గొంటూ ఉంటుంది.