రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ 'ఆర్‌ఆర్‌ఆర్' తాజాగా సెట్స్ మీదికెళ్లింది. ఈ సందర్బంగా టాలీవుడ్ నుండి ప్రముఖులు ఈ బిగ్ మల్టీస్టారర్ టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అందులో భాగంగానే స్మైలీ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్‌కి నెటిజన్లు రకరకాల కామెంట్స్ వేస్తున్నారు. రాజమౌళిని నువ్వెంత పొగిడినా, ఎన్టీఆర్, చరణ్‌లకు ఎన్ని బిస్కెట్లేసినా నీకంత సీను లేదులే. రాజమౌళి ఈ సినిమాలో నీకైతే ఛాన్సివ్వడులే అంటూ రకుల్‌పై నెటిజన్లు ట్రాలింగ్ స్టార్ట్ చేశారు. అయ్యో పాపం రకుల్ ఏం చేసింది. జస్ట్ క్యాజువల్‌గా విషెస్ చెప్పడంలో తప్పేముంది.. అని ఇంకొందరు నెటిజన్లు వాపోతున్నారు. అవును కదా ఇది టూ మచ్చే కదా. విషెస్ చెప్పడంలో రకుల్ తప్పేం లేదు.
సినిమాలో ఛాన్స్ దొరికిందా? లేదా ? అనే విషయం పక్కన పెడితే, ఎన్టీఆర్‌తో రకుల్ 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నటించింది. చరణ్‌తో 'బ్రూస్‌లీ', 'ధృవ' రెండు సినిమాల్లో నటించింది. సో ఆ రకంగా ఎన్టీఆర్, చరణ్‌లతో రకుల్‌కి ఉన్న చనువు ఎక్కువే. ఆ చనువుతోనే 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్‌కి రకుల్ ఆల్ ది బెస్ట్ చెప్పి ఉండొచ్చు.
ఇకపోతే ఆర్‌ఆర్‌ఆర్ హీరోయిన్స్ విషయానికి వస్తే, రాజమౌళి సినిమాల్లో హీరోయిన్స్ లిస్టు ఒకసారి పరిశీలించాలి. రాజమౌళి హీరోయిన్లు దాదాపు మన ఇండస్ట్రీ వాళ్లే ఉంటారు. పరభాషా ఇండస్ట్రీకి పెద్దగా ఛాన్సివ్వడు హీరోయిన్స్ విషయంలో రాజమౌళి. ఆ రకంగా చూసుకుంటే ఏమో రకుల్‌కి రాజమౌళి ఛాన్సిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి.