రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం టాక్సీవాలా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది. తొలిరోజు వసూళ్ళతోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో ఇప్పటికే ఈ సినిమా లాభాలు బాట పట్టిందని చేప్పొచ్చు.
ఇక తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ 9.30 కోట్ల (షేర్), రూ 18 కోట్ల (గ్రాస్) సాధించడంతో ఈ సినిమా కమర్షియల్ గా ఒక బ్లాక్ బస్టర్ సినిమా క్లబ్ లో చేరిపోయేలా కనిపిస్తుంది. ఇక రోబో 2.0 విడుదలయ్యే వరకు మరే పెద్ద సినిమా విడుదలకాకపోతుండడంతో టాక్సీవాలా సినిమాకి వసూళ్ళ పరంగా మరే అడ్డులేదు అని చెప్పొచ్చు.
ఇండస్ట్రీలోని రెండు పెద్ద నిర్మాణ సంస్థలు అండగా నిలిచి ఒక యంగ్ టీం తో చేయించిన చిత్రం టాక్సీవాలా అని చెప్పొచ్చు. వారి నమ్మకాన్ని ఈ చిత్ర యూనిట్ నిలుపుకుంది. NOTA సినిమాతో కాస్త డీలా పడ్డ విజయ్ కి ఈ విజయం మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పి.
ఇక ఈ సినిమా తన టోటల్ రన్ లో ఎంత రాబడుతుందో అన్నది వేచి చూడాలి.