గతంలో రకుల్ - కార్తీ జంటగా 'ఖాకీ' చిత్రంలో నటించారు. కార్తికి భార్యగా హోమ్లీ క్యారెక్టర్లో నటించింది రకుల్ ఆ సినిమాలో. అయితే ఇదో సీరియస్ మూవీ. ఈ సినిమాలో కార్తి పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాడు. సినిమా లెంగ్త్ ఎక్కువైందన్న నెపంతో సినిమా విడుదలయ్యాక రకుల్ నటించిన కొన్ని సీన్స్ కట్ చేయడం జరిగింది.
ఇలా జరిగినందుకు రకుల్‌కి చిత్ర యూనిట్ అప్పట్లో సోరీ కూడా చెప్పింది. ఒక్కసారి విడుదలయ్యాక హీరోయిన్ సీన్స్ సినిమా నుండి తొలిగించేయడం అనేది నిజంగా అవమానకరమైన విషయమే. కానీ పరిస్థితులను బట్టి, సీరియస్ మూవీలో హీరోయిన్ రొమాంటిక్ సీన్స్, ఫన్నీ ఫన్నీ సీన్స్ కొన్ని తొలగించక తప్పలేదట. అయితే ఇలా మిగిలిన ఆర్టిస్టుల సీన్స్ విషయంలో జరుగుతుంది కానీ, హీరోయిన్స్ విషయంలో జరగదు. రకుల్ తర్వాత అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న మరో ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్.
సందీప్ కిషన్ - మెహరీన్ జంటగా తెరకెక్కిన ఓ సినిమాలో కూడా ఇలాగే జరిగింది. మెహరీన్ సన్నివేశాలు చాలావరకూ లేపేశారు. ఇదిలా ఉండగా, రకుల్ పరిస్థితి అస్సలే బాగోలేదిప్పుడు. స్టార్ హీరోయిన్గా బోలెడంత క్రేజ్ ఉన్న టైంలోనే రకుల్ పరిస్థితి ఇలా జరిగింది. ఇప్పుడు రకుల్ స్టార్డమ్ అంతంత మాత్రమే అన్నట్లుగా ఉంది. అలాంటిది ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి మరి.
అసలే రకుల్ ఆశలన్నీ ఈ సినిమా పైనే. ఈ సినిమాతో రకుల్ సక్సెస్ అందుకుంటేనే పోగొట్టుకున్న తన స్టార్‌డమ్‌ని తిరిగి సంపాదించే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.