స్వయం కృషితో పైకి ఎదిగిన నటుడు చిరంజీవి. ఓ సామాన్యుడు మెగాస్టార్ అయ్యాడంటే - దాని వెనుక ఎంత కృషి, ఎంత తపన, ఎంత కష్టం ఉండాలి? ఉత్తినే మెగాస్టార్లు పుట్టేస్తారా? చిరు ఎంత కష్టజీవో చెప్పడానికి బోలెడన్ని ఉదాహరణలు. అందులో ఓ మచ్చు తునక ఇది.
అది `జగదీకవీరుడు అతిలోక సుందరి` సినిమా సెట్. చెన్నైలోని వాహినీ స్టూడియోలో థినక్కుతా.. కసక్కురో` పాట షూటింగ్ జరుగుతోంది. ఆరోజే పాట పూర్తి చేయాలి. ఎందుకంటే సాయింత్రానికి మరో హిందీ సినిఆమ కోసం శ్రీదేవి బోంబే వెళ్లిపోవాలి. కానీ చిరంజీవికి మాత్రం 104 డిగ్రీల జ్వరం. సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజు తప్పితే శ్రీదేవి మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో? మరోవైపు రిలీజ్ డేట్ కూడా ఫిక్సయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 104 డిగ్రీల జ్వరంలో కూడా చిరంజీవి స్టెపులేసి అదరగొట్టేశాడు. సెట్లో ఓవైపు డాక్టర్లు, నర్సులు.. మరోవైపు చిరు స్టెప్పులూ.
అలా ఆ పాట పూర్తయింది. ఇప్పుడు చూసినా ఆ పాట ష్రెష్‌గా ఉంటుంది. చిరంజీవికి అలసట మచ్చుకైనా కనిపించదు. అదీ.. మెగాస్టార్ అంటే. ఈ విషయం నిర్మాత అశ్వనీదత్ చాలాసార్లు గుర్తు చేసుకుంటారు. మే 9న జగదేకవీరుడు విడుదలై 30 ఏళ్లు. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ ఈ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసింది.