'రౌడీ' అంటే ఇష్టమంటోన్న రకుల్‌!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌, చరణ్‌, మహేష్‌, అల్లు అర్జున్‌.. ఇలా దాదాపు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరి సరసనా నటించేసిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఏ హీరో అంటే ఇష్టమో తెలుసా? రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి 'ఫీట్‌ అప్‌ విత్‌ స్టార్స్‌' ప్రోగ్రాంలో రకుల్‌ బయట పెట్టింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్‌ వంటి భామలు సాధారణంగా ఇష్టమైన హీరో అంటే ఆయా స్టార్స్‌లో ఎవరో ఒకరి పేరు చెప్పాలి. అలాంటిది నయా ట్రెండ్‌ హీరో రౌడీని ఇష్టపడడమేంటీ.? అని నెటిజన్లు వాపోతున్నారు.

 

అఫ్‌కోర్స్‌ ఇష్టం అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుందనుకోండి. దాన్ని తప్పు పట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అలా ఫస్ట్‌ క్రష్‌ విజయ్‌ దేవరకొండతో అని రకుల్‌ చెప్పడాన్ని అస్సలు తప్పు పట్టకూడదు. ఇకపోతే, బాలీవుడ్‌లో ఆమెకు రణ్‌బీర్‌ సింగ్‌ అంటే ఇష్టమట. తనకిష్టమైన హీరోల పేర్లా ఇవి. లేకుంటే, వాళ్లతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలన్న తపనో తెలీదు కానీ, మొత్తానికి తన ఫస్ట్‌ క్రష్‌ గురించి చెప్పి రకుల్‌ సంచలనమైంది.

 

ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తమిళంలో విశ్వ నటుడు కమల్‌ హాసన్‌తో 'ఇండియన్‌ 2'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు రకుల్‌ చేతిలో ఉన్న క్రేజీయెస్ట్‌ ప్రాజెక్ట్‌. తన ఫేట్‌ని మార్చాల్సిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో సిద్దార్ధ్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే రాజమండ్రిలో షెడ్యూల్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా చిత్రీకరణలో రకుల్‌ కూడా పాల్గొంటున్నట్లు తెలిసింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS