నయన్‌ డుంకీ, మిల్కీ బ్యూటీకి తెగ కలిసొస్తోందిలే.!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా నయనతారకు ఎంత గొప్ప క్రేజ్‌ ఉందో, ప్రమోషన్స్‌కి రాదు అన్న బ్యాడ్‌ ఇమేజ్‌ కూడా అంతే ఎక్కువ ఉంది. అయితే, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ అయిన 'సైరా నరసింహారెడ్డి' ప్రమోషన్స్‌కి నయనతార వస్తుందని ఇంతవరకూ ప్రచారం జరిగింది. కానీ, నయన్‌ తన ధోరణి ఎంత మాత్రమూ మార్చుకోలేదు. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ నయన్‌ కనిపించలేదు. కానీ, ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటించిన తమన్నా మాత్రం ప్రమోషన్స్‌లో మెయిన్‌ ఎట్రాక్షన్‌ అవుతోంది. ఎక్కడంటే అక్కడికి ప్రమోషన్స్‌లో హుషారుగా పాల్గొంటోంది.

 

నిజానికి ఇలాంటి అవకాశం అందరికీ అన్ని సమయాల్లోనూ రాదు. నయన్‌ ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది. అదే తమన్నాకి కలిసొచ్చింది. ప్రోమోస్‌లోనే నయన్‌తో పోల్చితే తమన్నా ఎక్కువ ఎలివేట్‌ అయిపోతోంది. ఇక బహిరంగ ప్రమోషన్స్‌లో కూడా సాంప్రదాయ దుస్తుల్లో మెగాస్టార్‌ పక్కన ఠీవీగా కనబడుతూ తన క్రేజ్‌ని మరింత పెంచుకుంటోంది. మెగాస్టార్‌తో ఇలాంటి ఓ గొప్ప చారిత్రక చిత్రంలో నటించడం, అలాంటి గొప్ప చిత్రాన్ని ప్రమోట్‌ చేయడంలో తనవంతు పాత్ర పోషించడం.. తన కెరీర్‌లోనే ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లుంది మిల్కీ బ్యూటీ.

 

నిజానికి ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటన్నింటినీ పక్కన పెట్టి, కేవలం 'సైరా' ప్రమోషన్స్‌ కోసమే తన డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకుందట తమన్నా. మొన్న హైద్రాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి హాజరు కాలేకపోయినందుకు చాలా బాధపడిందట. అందుకే ఆ తర్వాత ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే సాహసం చేయడం లేదట. ప్రస్తుతం 'సైరా' టీమ్‌ చెన్నైలో సందడి చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS