ర‌కుల్ పెళ్లి.... టాలీవుడ్ కి నో ఎంట్రీ

మరిన్ని వార్తలు

క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతోంది. త‌న చిర‌కాల ప్రియుడు జాకీ భ‌గ్నానిని పెళ్లాడ‌బోతోంది. ఈనెల 21న గోవాలో వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. తొలుత‌ విదేశాల్లో వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకొన్నా, చివ‌రి నిమిషంలో గోవాకి ఫిక్స‌య్యారు. దేశంలోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు సెల‌బ్రెటీలు మ‌రింత ప్రాచూర్యం క‌లిగించాల‌ని ఇటీవ‌ల మోడీ ఇచ్చిన పిలుపు మేర‌కు ర‌కుల్ ఈ నిర్ణ‌యం తీసుకొంద‌ట‌. గోవాని ఎంపిక చేసుకోవ‌డానికి కూడా ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉంది. ర‌కుల్, జాకీల ప‌రిచ‌యం గోవాలోనే జ‌రిగింది. అందుకే సెంటిమెంట్ ప‌రంగా గోవాలోనే పెళ్లి చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యారు.


అయితే ఈ శుభ‌కార్యానికి చిత్ర‌సీమ‌కు చెందిన‌ సెల‌బ్రెటీల్ని ఆహ్వానించ‌డం లేద‌ని తెలిసింది. పెళ్లి కుటుంబ స‌భ్యులు, అతి కొద్దిమంది స‌న్నిహితుల మ‌ధ్య సింపుల్ గా చేసుకోవాల‌ని ర‌కుల్ భావిస్తోంద‌ట‌. టాలీవుడ్, కోలీవుడ్ లోని టాప్ స్టార్లందరితోనూ ర‌కుల్ న‌టించింది. త‌న పెళ్లికి స్టార్ హంగామానే కావాల‌నుకొంటే, ర‌కుల్ వాళ్లంద‌రినీ ఆహ్వానించి ఉండొచ్చు. కానీ... ఈ హ‌డావుడేం వ‌ద్ద‌నుకొంటోంది. పెళ్లికి కూడా పెద్ద‌గా హ‌డావుడి చేయ‌డం లేదు. నిన్న‌టి వ‌ర‌కూ త‌న షూటింగ్ ల‌తో బిజీగా ఉంది. పెళ్లి త‌ర‌వాత కొన్ని రోజులు విదేశాల్లో గ‌డిపి, ఆ త‌ర‌వాత మ‌ళ్లీ య‌ధావిధిగా తన సినిమాలూ, షూటింగుల‌తో త‌ల‌మున‌క‌లు కాబోతోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS