'అవంతిక'గా ఇటీవల 'మన్మధుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ కనిపించనంత హాట్‌గా, బోల్డ్‌గా కనిపించి ప్రశంసల మాటే లేదు కానీ, కొన్ని విమర్శలైతే మూట కట్టుకుంది. కానీ, తన తీరేం మారదంతే.. అనేలా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. హాట్ హాట్ బికినీ ఫోటోలవి. టూ పీస్ బికినీలో రకుల్ ఇంత హాట్‌గా అందాలారేసేయడం బహుశా ఇదే తొలిసారి ఏమో.
రకుల్ హాట్ యాంగిల్స్ నెటిజన్స్‌కి అలవాటే కానీ, టూ పీస్ బికినీలో రకుల్ ఇంతలా రెచ్చిపోవడంతో మళ్లీ ఏమైంది.? రకుల్‌కి.. అంటూ క్రిటిసైజ్ మొదలెట్టేశారు. అప్పుడెప్పుడో 'సౌఖ్యం' సినిమాలో బికినీలో కనిపించిన రకుల్, మళ్లీ బికినీ వేసిన దాఖలాలు లేవు. ఇక తాజా పిక్స్ విషయానికి వస్తే, రాయల్ బ్లూ కలర్ టూ పీస్ బికినీ ధరించిన రకుల్, కళ్లకు గాగుల్స్ ధరించి స్టైలిష్‌గా కనిపిస్తోంది. జుట్టుకు పింక్ షేడ్ హెయిర్ కలర్ వాడింది. ఘాటుగా సెల్ఫీలకూ పోజిచ్చేస్తూ, హొయలు పోతోంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే, నెటిజన్లు, రకుల్‌తో ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు ఇది మామూలే కదా.