తమిళంలో రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్న 'ఎన్జీకే' చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కావడంతో తెలుగులోనూ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అయితే, తెలుగు ప్రమోషన్స్ బాధ్యత పూర్తిగా రకుల్ ప్రీత్ సింగ్ తలకెక్కించుకున్నట్లనిపిస్తోంది. ఈ సినిమా పేరు చెప్పి రకుల్ తెలుగు ఛానెల్స్‌లో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగులో ఒకప్పుడు రకుల్‌కి తిరుగే లేదు.
కానీ ఇప్పుడు కాదు. 'ఎన్జీకే' సినిమాతో మళ్లీ అప్పటి వైభోగాన్ని సంపాదించాలనుకుంటోంది రకుల్. అందుకే దొరికిన అవకాశాన్ని ఇలా వినియోగించుకుంటోంది కాబోలు. కొంచెం ఎక్కువ చేస్తోంది రకుల్ అనిపించినా, వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నట్లుగా, మధ్య మధ్యలో తెలుగు ప్రేక్షకులపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటోంది ఈ సందర్భంగా. సూర్య హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌తో పాటు, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సెల్వరాఘవన్ ఈ సినిమాకి దర్శకుడు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే, రకుల్ మొన్నీ మధ్యనే 'దే దే ప్యార్ దే' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించింది. మరీ ఆశించిన స్థాయి విజయాన్ని ఈ సినిమాతోనూ రకుల్ అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కోసం రకుల్ భీభత్సంగా అందాలు ఆరబోసేసింది. మరోవైపు తెలుగులో 'మన్మధుడు 2'తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కురిపించేస్తోంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత గెస్ రోల్ పోషిస్తోంది.