రకుల్‌ 'ఎటాక్‌' మొదలైంది.!

మరిన్ని వార్తలు

అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో పెద్దగా హవా చూపించకపోయినా, బాలీవుడ్‌లో ఒకటీ అరా అవకాశాలతో బాగానే వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌పై గంపెడు ఆశతో టాలీవుడ్‌లో కెరీర్‌ మంచి జోరు మీదున్న సమయంలోనే అక్కడ పాదం మోపింది. అయితే, అంతగా కలిసి రాలేదు. ఇటీవల అజయ్‌ దేవగణ్‌తో 'దేదే ప్యార్‌ దే' సినిమాలో విచ్చల విడిగా అందాలారబోసి, హాట్‌ సెన్సేషన్‌ అయ్యింది. ఈ సినిమాతో జనాల నోళ్లలో బాగా నానింది కానీ, బాక్సాఫీస్‌ వద్ద సినిమా నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే, జాన్‌ అబ్రహాం హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా లేటెస్ట్‌గా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యింది.

 

లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్‌తో పాటు ఈ సినిమాలో హాట్‌ బ్యూటీ జాక్వెలీన్‌ ఫెర్నాండేజ్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. 'ఎటాక్‌' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు తెలుగులోనూ ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ సినిమాలో నటిస్తోంది. నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, సెన్సేషనల్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే తమిళంలోనూ రకుల్‌ ఓ సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS