డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కి సమన్లు రావడం, ఎన్‌సీబీ అధికారుల ముందు విచారణకు హాజరవ్వడం తెలిసిన విషయాలే. రకుల్ ని అధికారులు దాదాపు 3 గంటల పాటు విచారించారు. అడిగినప్పుడల్లా రకుల్ విచారణకు హాజరుకావాల్సివుంటుందని, అందుకే ముంబై విడచి వెళ్లకూడదని రకుల్ ని అధికారులు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. దాంతో రకుల్ కొన్ని రోజుల పాటు ముంబైలోనే ఉండిపోవాల్సివస్తుందనుకున్నారంతా.
కానీ.. రకుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. త్వరలోనే షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. దీంతో ఈ విచారణ నుంచి రకుల్ కి ఉపశమనం దొరికినట్టైంది. రకుల్ విచారణ పూర్తయ్యిందని, ఆమె ఇక ఎన్ సీ బీ ముందు హాజరవు కావాల్సిన అవసరం లేదని రకుల్ సన్నిహితులు చెబుతున్నారు. మరీ అత్యవసరమైతే.. హైదరాబాద్ నుంచి ముంబై ప్రయాణం అవ్వాల్సివుంటుంది. అయితే సమన్ల విషయంలో రకుల్ కి ఉపశమనం లభించినట్టే అని ఇన్ సైడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.