సాధారణంగా సినీ రంగంలో స్టార్‌డమ్‌కి వేల్యూ తప్ప, స్టార్స్‌కి కింద ఉన్న వాళ్లకి అంతగా వేల్యూ ఉండదు. స్టార్స్ అలాంటి వాళ్లని పెద్దగా పట్టించుకోరు కూడా. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న మనస్తత్వం కలది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. మొదట్నుంచీ రకుల్ అంటే అందరికీ అందుకూ ఎంతో అభిమానం. ఆమె తనకు మేకప్ వేసే అసిస్టెంట్ దగ్గర్నుంచీ జ్యూస్ తెచ్చిచ్చే బోయ్ వరకూ అందర్నీ గుర్తు పెట్టుకుంటుంది. చాలా గౌరవంగా చూస్తుంది. తాజాగా రకుల్‌కి మేకప్ అసిస్టెంట్ అయిన చక్రవర్తి బర్త్‌డే సందర్భంగా ఆయనకి హ్యాపీ బర్త్‌డే విషెస్ చెబుతూ ఆయనతో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్‌డే చక్రి అన్నా అంటూ ఆప్యాయంగా సంబోధించింది. అదే రకుల్‌లో ఉన్న స్పెషల్. తానెంత అలసిపోయినా, కానీ చక్రి అన్న అదేమీ కనబడకుండా తన మేకప్‌తో కవర్ చేసేస్తాడు అని ట్వీట్ చేసింది. మేకప్ అసిస్టెంట్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్‌లో చాలా తక్కువ మందికి మాత్రమే గుర్తింపు ఉంది. నీరజా కోన, రమా రాజమౌళి వంటి వారు మాత్రమే మేకప్ అసిస్టెంట్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్‌లో పాపులారిటీ పొంది ఉన్నారు. అలాంటిది రకుల్ తన మేకప్ అసిస్టెంట్‌కి ఇంతగా విలువ ఇవ్వడం అనేది ఆమె పెద్ద మనసుకు నిదర్శనం. స్టార్ హీరోయిన్‌గా ఎదగడమే గొప్పతనం కాదు, ఇలాంటి గొప్పతనం సంపాదించుకోవడం అనేది చాలా తక్కువ మందికే దక్కే అదృష్టం. ఆ అదృష్టాన్ని రకుల్ దక్కించుకుంది. అందుకే రకుల్ అంటే అందరికీ అంత ఇష్టం ఇండస్ట్రీలో.