మీటూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటుడు అలోక్‌నాధ్ విషయంలో అజయ్‌దేవగణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అజయ్‌దేవగణ్ నటించిన 'దేదేప్యార్ దే' సినిమాలో అలోక్ నాధ్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయనపై మీటూ ఆరోపణలు వచ్చాయి.
సినిమా విడుదలకు సిద్ధమైంది. మీటూ ఆరోపణల నేపథ్యంలో అలోక్‌నాధ్‌ని సినిమా నుండి తొలిగించాలంటూ బాలీవుడ్‌లో ప్రముఖ రచయిత వింటా నందా ఆరోపించారు. అలోక్ తనపై అత్యాచారం చేశాడనీ, ఆయన నటించిన సినిమాని బ్యాన్ చేయాలి లేదా.. ఆయన పాత్రను సినిమా నుండి తొలిగించాలని వింటా నందా అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ సినిమా విడుదల దగ్గరపడిన నేపథ్యంలో అది కుదరదనీ, ఆయన్ని తొలగించి మళ్లీ రీషూట్ చేయడం కుదరదనీ అజయ్‌దేవగణ్ తేల్చి చెప్పేశారు. సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు, అయినా అలోక్ నటించిన సన్నివేశాలు ఆయన ఒక్కరితో ముడిపడి ఉన్న సన్నివేశాలు కావనీ, ఆయనతో పాటు పది మంది ఆర్టిస్టులు ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారనీ, ఏకంగా 40 రోజుల భారీ షెడ్యూల్‌ని అలోక్‌పై చిత్రీకరించారు.. అయినా అది ఆగష్టులోనే చిత్రీకరణ అయిపోయిందనీ, ఆయనపై ఆరోపణలు ఇప్పుడొచ్చాయనీ, ఆయన వ్యక్తిత్వం ఇదీ అని తెలిసినా సినిమా నుండి ఆయన్ని తొలగించడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యం కాని పని అనీ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రకుల్‌కి బాలీవుడ్‌లో ఈ సినిమా ఎంతో కీలకం.
ఈ సినిమా విషయంలో తాజాగా నెలకొన్న వివాదం రకుల్‌కి ఎలాంటి టర్నింగ్ ఇస్తుందో చూడాలిక. మే 17న ప్రేక్షకుల ముందుకు రానున్న 'దేదే ప్యార్‌దే' సినిమాలో అజయ్‌దేవగణ్ సరసన రకుల్‌తో పాటు, సీనియర్ భామ టబు హీరోయిన్‌గా నటిస్తున్నారు.