రకుల్‌ ఫిట్‌నెస్‌ ఫిలాసఫీ: దానికి కౌంటరేనా.!

మరిన్ని వార్తలు

ఫిట్‌నెస్‌ అంటే బక్కచిక్కిపోవడం కాదు, శరీరంలో పేరుకుపోయిన అనవసర వ్యర్ధాల్ని తొలిగించుకోవడం. అడ్డదిడ్డంగా పెరిగిపోయే కొవ్వుకు అడ్డుకట్ట వేయడం.. శరీరంపై కాన్ఫిడెన్స్‌ పెంచుకోవడం అంటూ చిన్నపాటి క్లాస్‌ తీసుకుంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

 

ఫిట్‌నెస్‌కి రకుల్‌ పెట్టింది పేరు. తనతో పాటు. తనలా ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకోవాలనుకునే అమ్మాయిల కోసం పలు చోట్ల ఫిట్‌నెస్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ కూడా రన్‌ చేస్తోంది. ఇవన్నీ తెలిసిన విషయాలే.. అయితే, ఇప్పుడెందుకు రకుల్‌ కొత్తగా ఫిట్‌నెస్‌ పాఠాలు వల్లెవేస్తోందయ్యా అంటే, ఈ మధ్య రకుల్‌పై కొన్ని గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. వర్కవుట్స్‌ చేసి చేసి బక్క చిక్కిపోయిన రకుల్‌ని 'మన్మధుడు 2' కోసం బరువు పెరగాలనీ, కాస్త బొద్దుగా కనిపించాలనీ రకుల్‌కి నాగార్జున సూచించాడనీ, అయితే రకుల్‌ మాత్రం ఫిట్‌నెస్‌ పేరు చెప్పి ఇంకా వర్కవుట్స్‌ చేస్తోందనీ.. సో ఆ విషయమై నాగార్జున రకుల్‌పై కోపంగా ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ న్యూస్‌ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అదేం లేదనీ, అవన్నీ జస్ట్‌ పుకార్లేననీ, సినిమా స్టార్ట్‌ అయిన రోజు నుండీ రకుల్‌ షూటింగ్‌లో పాల్గొంటోందనీ, ఆమె ఫిట్‌నెస్‌పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవనీ ఇప్పటికే డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ క్లారిటీ ఇచ్చేశాడు.

 

అయినా ఈ రూమర్స్‌ ఆగనందున, తాజాగా రకుల్‌ ఇన్‌డైరెక్ట్‌గా ఈ ట్వీట్‌ చేసింది. తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి రకుల్‌ ప్రీత్‌ ఈ విధంగా కౌంటర్‌ ఇచ్చిందనుకోవాలి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS