రకుల్‌ అలా రీ ఎంట్రీ ఇస్తుందా?

By iQlikMovies - July 12, 2018 - 12:34 PM IST

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. అయితే ఇదంతా ఒకప్పుడు. 'అయ్యారీ' సినిమా వంకతో బాలీవుడ్‌కి చెక్కేసిన రకుల్‌కి ప్రస్తుతం తెలుగులో అస్సలు సీను లేకుండా పోయింది. మచ్చుకైనా రకుల్‌ పేరు తెలుగులో వినిపించే అవకాశం కనిపించడం లేదు. 

అయితే ఇప్పుడిప్పుడే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు ఆ నోటా ఈ నోటా తెలుగులో కాస్త గాలి వాటుగా విహరిస్తోంది. అది కూడా హీరోయిన్‌ ప్లేస్‌లో కాదు, ఐటెం గాళ్‌ ప్లేస్‌లో. చరణ్‌తో రకుల్‌ రెండు సినిమాల్లో నటించింది. అవి హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే, వీరిద్దరిదీ బెస్ట్‌ పెయిర్‌గా ఫ్యాన్స్‌ భావించారు. అందుకే చరణ్‌ ప్రస్తుతం నటిస్తున్న బోయపాటి సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం రకుల్‌ని తీసుకొస్తున్నారట. ఈలోగానే మరోలా రకుల్‌ పేరు వినిపిస్తోంది తాజాగా. బాలయ్య హీరోగా నటిస్తున్న 'ఎన్టీఆర్‌' సినిమాలోనూ రకుల్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోందనీ ప్రచారం జరుగుతోంది. 

అయితే స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవితగాధ ఆధారంగా తెరకెక్కుతోన్నఈ సినిమాలో ఐటెం సాంగ్స్‌ అంటే ఆనాటి కాలానికి టచ్‌ చేసేలా ఉంటాయి. అంటే జయమాలినీ, జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మిత తదితరుల కాలం నాటివన్న మాట. అంటే రకుల్‌ ఆ తరహా ఐటెం సాంగ్‌లోనే స్టెప్పులేస్తుందా? ఏమో చూడాలి మరి. ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలీదు కానీ, మొత్తానికి రకుల్‌ రీ ఎంట్రీ టాక్‌ అలా నడుస్తోందన్న మాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS