షూటింగ్‌లు నిలిచిపోవడం వల్ల ఆదాయం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ చారిటీ'కి హీరో సుశాంత్ రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయన తెలియజేశారు. సోమవారం ఆయన, "ఇవి ఒకరినొకరు చూసుకోవాల్సిన రోజులు. ఈ సంక్షోభ సమయంలో దినసరి వేతనంతో జీవనం సాగించే సినీ కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడానికి నా వంతు చిన్న సాయంగా రూ. 2 లక్షలు కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తానని వినమ్రంగా తెలియజేస్తున్నా. అందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నా" అని ట్వీట్ చేశారు.