సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది నయనతార పేరే. సౌత్ సినిమాకి సంబంధించినంతవరకు నయనతార హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా నయనతారకి క్రేజ్ పెరుగుతూనే వెళుతోంది. నయనతార చేసే సినిమాల్లో కొన్ని చిన్నవి కావొచ్చు.. కానీ, ఆమె రెమ్యునరేషన్ మాత్రం అలా అలా పైపైకి ఎగబాకేస్తూనే వుంది. ఇక, పర్సనల్ లైఫ్ విషయానికొస్తే నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో వుంది. ఐదేళ్ళ వీరి ప్రేమాయణం ఇంకా అలాగే కొనసాగుతోంది. ఎప్పటికప్పుడూ ఈ ఇద్దరూ తమ ప్రేమను ఫొటోలు, వీడియోల రూపంలో వెల్లడిస్తూనే వున్నారు.
ఇంతకీ పెళ్ళప్పుడు.? అంటే మాత్రం, ఇద్దరూ సమాధానం చెప్పరు. నయనతార విషయానికొస్తే, ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అని చాలా సందర్భాల్లో నయనతార తేల్చి చెప్పేసింది. ‘మేం ప్రేమికులుగా బాగానే వున్నాం.. ఆ సంగతి మీకూ తెలుసు.. పెళ్ళి గురించిన చర్చ ఎందుకు ఇక్కడ.?’ అని తాజాగా నయనతార ఇంకోసారి పెళ్ళి ప్రస్తావన వస్తే కసురుకుంది. ‘పెళ్ళి అనేది ఇద్దరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ విషయంలో నయనతార అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను..’ అని విఘ్నేష్ శివన్ ఓ సందర్భంలో చెప్పాడు. తాజాగా వేలంటైన్స్ డే సందర్భంగా నయనతారపై తనకున్న ప్రేమని ఈ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా వెళ్ళడించాడు. ‘ఐదేళ్ళ తమ ప్రేమ.. చాలా అద్భుతమైనది’ అంటూ పేర్కొన్నాడు విఘ్నేష్.