ఫాన్స్ కి షాక్ ఇచ్చిన రామ్ చరణ్ నిర్ణయం

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈరోజు సినిమాల కలెక్షన్స్ గురించిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ వివరాల్లోకి వెళితే, ఈరోజు ఒక మొబైల్ కంపెనీ లాంచ్ లో పాల్గొనడానికి వచ్చిన ఆయనకి సినిమాలకి సంబంధించి అలాగే కలెక్షన్స్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి నిర్మొహమాటంగా సమాధానాలు ఆయన చెప్పడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 

ఆ సమాధానం ఏంటంటే- తన చిత్రాలకి సమబందించి ఇక పై కలెక్షన్స్ పోస్టర్లు పైన వేయడం కాని చెప్పడం కాని చేయొద్దు అని సూచిస్తాను అని చెప్పాడు. అలాగే ఒక సినిమాని ఎంతమంది చూసారు అన్న దాని పైన ఆ చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది అంతేగాని ఆ చిత్రం కలెక్షన్స్ బట్టి కాదు అని చెప్పుకొచ్చాడు. 

ఏదేమైనా.. రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సాహసమే అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS