'హ్యాపీ వెడ్డింగ్‌'కి మెగా పవర్‌ న్యూ గ్లామర్‌

By iQlikMovies - July 20, 2018 - 17:52 PM IST

మరిన్ని వార్తలు

మెగా డాటర్‌ నిహారిక నటిస్తున్న తాజా చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్‌'. ఈ నెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'హ్యాపీ వెడ్డింగ్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. 

ఈ శనివారం అనగా జూలై 21న జరగబోయే ఈ గ్రాండ్‌ ఈవెంట్‌కి మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా రానున్నాడు. నిహారిక మొదటి సినిమా 'ఒకమనసు' చిత్రం ఆడియో ఫంక్షన్‌ వేడుకకు కూడా రామ్‌చరణ్‌ విచ్చేసి, చెల్లిలిని ఆశీర్వదించాడు. ఆ సినిమా ప్రమోషన్స్‌ని కూడా ఘనంగా నిర్వహించారు. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత నిహారిక చాలా గ్యాప్‌ తీసుకుంది. 'ఒక మనసు' లాంటి స్టోరీతో కాకుండా, ఈ సారి హ్యాపీ హ్యాపీగా 'హ్యాపీ వెడ్డింగ్‌' అంటూ వచ్చేస్తోంది. 

ఈ సినిమా టీజర్‌, పోస్టర్లు ఆశక్తిగా అనిపిస్తున్నాయి. క్లీన్‌ లవ్‌స్టోరీ. అంతకు మించి ఫ్యామిలీ ఎమోషన్స్‌. పెద్దలు కుదిర్చిన పెళ్లి, పెళ్లి కుదిరిన తర్వాత ఆ రెండు యువ మనసుల మధ్య ఎలాంటెలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి తదితర అంశాల్ని చాలా చక్కగా ఈ చిత్రం ద్వారా చూపించారు. లక్ష్మన్‌ కారుణ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సక్సెస్‌ఫుల్‌ చిత్రాల బ్యానర్‌ అయిన యువీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

చూడాలి 'హ్యాపీ వెడ్డింగ్‌'తోనైనా మెగా డాటర్‌ హ్యాపీ హిట్‌ అందుకుటుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS