ప్రముఖ సింగర్ సునీత తన రెండో పెళ్లి పై వస్తున్న పుకార్లపై స్పందించింది. తనపై, తన వ్యక్తిగత జీవితంపై ఆధారం లేని వార్తలు ఎలా రాస్తారంటూ నిలదీసింది. చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకున్న సునీత, ఆ తర్వాత భర్త నుండి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఒక బాబు, ఒక పాప. ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్ పైన, పిల్లల ఆలనాపాలన పై దృష్టి పెడుతుంది.
అయితే రీసెంట్ గా ఆమె రెండో పెళ్ళి చేసుకుంటుందని పలు సోషల్ మీడియాలో పోస్ట్ లు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, ఒక వీడియోను పేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేసారు. 'నాకు వరుసగా ఫోన్ కాల్స్.. మెసేజ్' లు వస్తున్నాయి. 'మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారట కదా' అని అందరూ అడుగుతున్నారు. అవునా ఎవరు అని నేను అడిగితే.. 'ఐటీ ప్రొఫెషనల్' అట కదా అంటున్నారు. చాలా వెబ్ సైట్ ఈ విషయం గురించి రాసుకొచ్చాయి.
నిజం చెప్పాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకులేదు. నేను ఒక మాట చెబితే అది వేరే విధంగా జనంలోకి వెళుతుంది. అలా వెళ్ళకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ని పోస్ట్ చేస్తున్నాను. ఇది నా పర్సనల్ విషయం కనుక తరువాత కూడా నేను చెబితేనే అది నిజమని భావించాలి. అప్పటివరకు వచ్చే పుకార్లను నమ్మొద్దని ఆమె సృష్టం చేసింది.