సస్పెన్స్‌ ఓవర్‌.. 'ఆర్‌సి-12' ఫస్ట్‌ లుక్‌ వచ్చేస్తోంది

మరిన్ని వార్తలు

సస్పెన్స్‌కి తెరపడింది. రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆర్‌సి12' ఫస్ట్‌ లుక్‌ రేపే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత డి.వి.వి. దానయ్య వెల్లడించారు. 

ఒకే రోజు రెండు గుడ్‌ న్యూస్‌లు మెగా ఫ్యాన్స్‌కి ఇచ్చేశారు నిర్మాత. అవేంటంటే, ఒకటి ఫస్ట్‌ లుక్‌కి సంబంధించిన న్యూస్‌, ఇంకోటి టీజర్‌కి సంబంధించిన న్యూస్‌. నవంబర్‌ 9వ తేదీన సినిమా టీజర్‌ విడుదల కాబోతోంది. అంటే, దీపావళికి ముందు ఓ పటాకా, దీపావళి తర్వాత మరో పటాకా అన్న మాట. అసలు ఈ సినిమా నిర్మాణం ఎక్కడిదాకా వచ్చింది.? అన్న సందేహాల నడుమ, అనేక గాసిప్స్‌ నడుమ.. వాటన్నిటికీ చెక్‌ పెడుతూ.. 

సినిమా నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనే క్లారిటీ ఇటీవల ఇస్తూనే, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయబోతున్నామని నిర్మాత దానయ్య ప్రకటించేసరికి అంతా అవాక్కయ్యారు. 'సస్పెన్స్‌ ఓవర్‌..' అంటూ సోషల్‌ మీడియాలో రామ్‌చరణ్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ గురించి హ్యాపీ హ్యాపీగా ట్వీట్లేస్తూ పండగ చేసేసుకుంటున్నారు అభిమానులు. చరణ్‌ ఈసారి ఈ సినిమా కోసం ఎలాంటి ప్రయోగాలూ చేయడంలేదు. 

కంప్లీట్‌ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఈ సినిమా. చరణ్‌ మార్కు డాన్సులు, చరణ్‌ మార్క్‌ యాక్షన్‌.. ఈ సినిమాలో వుంటుంది. బోయపాటి మేకింగ్‌ ఈ సినిమాకి మరో ప్రత్యేకత. అన్నట్టు 'భరత్‌ అనే నేను' ఫేం కియారా అద్వానీ ఈ సినిమాలో చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌, ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS