మగధీరలో చిరు గెస్ట్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. చిరు, చరణ్‌లను ఒకే తెరపై చూడడం అభిమానులకు పండగలా అనిపించింది. ఆ తరవాత బ్రూస్లీ, ఖైది నెం.150లో ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. ఆచార్యలో అయితే.. చిరు, చరణ్ పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబోని తెరపై చూసుకొనే ఛాన్సుందన్నది టాలీవుడ్ టాక్.
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కైరా అద్వాణీ కథానాయిక. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రంలో చరణ్ రెండు రకాల గెటప్పుల్లో కనిపించనున్నాడు. తండ్రీ కొడుకులుగా చరణ్ పాత్ర ఉండబోతోందని టాక్. అయితే ఈ సినిమాలో అతిథి పాత్రలో చిరు తళుక్కున మెరిసే అవకాశం ఉందని టాక్.
శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చిరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ కుదర్లేదు. భవిష్యత్తులో కుదిరే అవకాశమూ కనిపించడం లేదు. అందుకే ఆ ముచ్చట చిరు ఇలా తీర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల చిరుని కలిసిన శంకర్ గెస్ట్ రోల్ గురించి వివరించినట్టు టాక్. చిరు కూడా హ్యాపీగా ఒప్పుకొన్నాడని తెలుస్తోంది. 2023 సంక్రాంతికి ఈసినిమాని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో.. సంక్రాంతికి ఈ సినిమా సిద్ధం చేయడం కష్టం. 2023 వేసవికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.