మ‌రోసారి అమ్మ‌డూ.. లెట్స్ డూ కుమ్ముడూ..!

By Gowthami - December 01, 2021 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

ఖైదీ నెం. 150లో అమ్మ‌డూ లెట్స్ డూ కుమ్ముడూ అంటూ... చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేశారు. ముఖ్యంగా ఇద్ద‌రూ బెల్ట్ ప‌ట్టుకుని వేసిన స్టెప్ హైలెట్. ఆ సినిమా విజ‌యంలో.. అది ఓ కీల‌క పాత్ర పోషించింది. మ‌రోసారి ఇలాంటి మాస్ పాటలో.. చిరు, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి స్టెప్పులేయ‌బోతున్నార్ట‌.

 

చిరు - చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఇటీవ‌లే సిద్ధ పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశాడు. అంత‌కు ముందు ఆచార్య‌గా చిరుని ప‌రిచ‌యం చేశాడు. ఆచార్య టీజ‌ర్ కంటే.. సిద్ధ టీజ‌ర్‌తోనే.. ఈ సినిమాకి మంచి మైలేజీ వ‌చ్చింది. ఇప్పుడు చిరు, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిపి మ‌రో టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు... ఈ సినిమాలో చిరు, చ‌ర‌ణ్‌లు క‌లిసి ఓ మాస్ పాట‌కు స్టెప్పులు వేశార్ట‌. దీనికి శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు. ఈ పాటలో కూడా సిగ్నేచ‌ర్ స్టెప్పులు అదిరిపోతాయ‌ని, ఫ్యాన్స్ కి ఈ పాట థియేట‌ర్లో పూన‌కాలు తెప్పించ‌బోతోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ పాట‌కి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం సిద్ధం అవుతోంది. కాజ‌ల్‌, పూజా హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS