పవన్ బాబాయ్ కి అది అస్సలు నచ్చదు- రామ్ చరణ్

మరిన్ని వార్తలు

రంగస్థలం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ కి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలని ఓ ప్రముఖ పత్రికకి వెల్లడించాడు.

ఇక ఆ ఆసక్తికర విషయాలు ఏంటంటే- తన తల్లి పవన్ కళ్యాణ్ ని ఓ మరిదిలా కాకుండా కన్నా కొడుకులా చూసుకుంటుంది అని అలాగే తన తల్లికి ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోతే తమ ఇంటికి వచ్చి మరి కలిసి వెళ్ళాడట.  ఈ మధ్యనే ఆయనకీ కొడుకు పుట్టాక ఆ చిన్న బాబుని తీసుకు వచ్చి తమకి చూపెట్టి మరి ఆ బాబుకి ఏ పేరు పెట్టబోతున్నది కూడా చెప్పాడట.

కొన్ని ఏళ్ళ క్రింద తన తండ్రి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తాము కూడా ప్రచారానికి వస్తా అన్నప్పుడు ఇప్పుడే మీరు రాజకీయాల్లోకి ఎందుకు అని పవన్ తమని సున్నితంగా మందిలించాడని కూడా గుర్తు చేసుకున్నాడు.

అలా తన జీవితంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి చాలా ప్రభావం ఉన్నది అని తెలియచేశాడు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS