మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా పరిచయమయ్యి నేటికి పదేళ్లు పూర్తయ్యింది. 'చిరుత' సినిమాతో తెరంగేట్రం చేశాడు. 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ వారసుడిగా, వారసత్వం ఇంట్రడక్షన్ వరకే. తర్వాత నుండీ సొంత టాలెంట్‌తోనే ఇమేజ్ పెంచుకున్నాడు. మెగాస్టార్ తనయుడైనప్పటికీ తనదైన ఇమేజ్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు రామ్ చరణ్. వరుసగా కంటెస్టెంట్ హిట్స్ కొట్టాడు. మాస్ సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటూ, 'గోవిందుడు అందరివాడేలే' సినిమాతో రూటు మార్చాడు. 'ధృవ' సినిమాతో ప్రయోగాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు 'రంగస్థలమ్' సినిమాతో మరో ప్రయోగానికి తెర లేపాడు. మెగాస్టార్ తనయుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమే కాదు, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు రామ్‌చరణ్. ఒక పక్క హీరోగానూ, మరో పక్క నిర్మాతగానూ, తండ్రి సినిమాతో తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు చేపట్టి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. మెగా పవర్ స్టార్ అనే పేరును సార్ధకం చేసుకున్నాడు రామ్‌చరణ్. తొలి సినిమా 'ఖైదీ'తో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న చరణ్, మళ్లీ 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో భారీ నిర్మాణ బాధ్యతలను మోస్తున్నాడు. 'రంగస్థలమ్' సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. హీరోగానూ, నిర్మాతగానూ రెండు భారీ ప్రాజెక్టులను ఏకకాలంలో మేనేజ్ చేయడం ఒక్క చరణ్‌కే చెల్లిందనడం నిస్సందేహం.