చరణ్‌ ఇన్‌స్టాగ్రాంలో తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా!

మరిన్ని వార్తలు

ఇంతవరకూ రామ్‌చరణ్‌కి సంబంధించిన ఏ అప్‌డేట్‌ అయినా ఆయన భార్య ఉపాసన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారానే పోస్ట్‌ అవుతూ ఉంటాయి. అంటే, చరణ్‌కి ఇంతవరకూ సోషల్‌ మీడియాలో ఏ ప్లాట్‌ఫాం లేదు. నిజంగా ఆశ్చర్యమే కదా. ఈ జనరేషన్‌ హీరోలు సోషల్‌ మీడియాని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. దాంతో పాటు, ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్‌ అవడానికి ఆ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామే బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటూ వస్తోంది.

 

అలాంటిది చరణ్‌కి ఇంతవరకూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం లేకపోవడం ఆశ్చర్యమే మరి. అందుకే ఆ లోటు తీర్చేందుకే చరణ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇచ్చేశాడు. రీసెంట్‌గా చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఒక్క పోస్ట్‌ కూడా పెట్టకపోయినా, అకౌంట్‌ ఓపెన్‌ చేసిన కొద్ది గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ వచ్చి చేరిపోయారు. ఇక తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో చరణ్‌ చేయబోయే తొలి పోస్ట్‌ ఏంటో తెలుసా.? 'సైరా' కి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వనున్నాడట. ఈ శుక్రవారం ఆ తొలి పోస్ట్‌ చేయనున్నాననీ చరణ్‌ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. '@AlwaysRamcharan అనే ఐడీతో రామ్‌చరణ్‌ ఈ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌ని క్రియేట్‌ చేశాడు.

 

ఇంతకీ చరణ్‌ చేయబోయే ఆ తొలి పోస్ట్‌ ఏంటో. 'సైరా'కి సంబంధించి రాబోయే ఆ అప్‌డేట్‌ ఏంటో.? అంటూ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ మొదలైంది. ఆ ఉత్కంఠకు తెర పడాలంటే ఫ్రైడే వరకూ వేచి చూడాల్సిందే. మరోవైపు చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌ పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చరణ్‌ పాత్రకు తండ్రిగా అజయ్‌ దేవగణ్‌ ఈ సినిమాలో నటించబోతున్నాడనీ తెలుస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS