మేజర్‌ అజయ్‌ కృష్ణగా రాబోతున్న సూపర్‌స్టార్‌!

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌బాబు పాత్ర పేరును చిత్రయూనిట్‌ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్‌బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాత్రకు సంబంధించిన ఫోటో కూడా లీక్‌ అయ్యి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో చిత్రయూనిట్‌ ఇంకాస్త తొందరపడింది.

 

పేరును అధికారికంగా ప్రకటించింది. 'మేజర్‌ అజయ్‌ కృష్ణ'గా మహేష్‌బాబు పాత్ర పేరును జాతీయ చిహ్నాలతో కూడిన లోగోతో పాటు అనౌన్స్‌ చేసింది. అయితే అజయ్‌ అనే పేరు మహేష్‌బాబు నటించిన గత చిత్రాల్లో సక్సెస్‌ఫుల్‌ నేమ్‌గా పాపులర్‌ అయ్యింది. ఆయన నటించిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ 'పోకిరి'లో ఆయన పేరు అజయ్‌, అలాగే 'ఒక్కడు', 'దూకుడు' చిత్రాల్లోనూ మహేష్‌ పాత్ర పేరు అజయ్‌ కావడం, ఆ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ కావడం విశేషం.

 

ఆ సెంటిమెంట్‌తో ఈ సినిమాకి ఆ పేరు సెలెక్ట్‌ చేశారేమో బహుశా. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి సినిమాని రిలీజ్‌ చేయనున్నారు. రష్మికా మండన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో మహేష్‌ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్‌ నటి విజయశాంతి ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రోల్‌లో కీలక భూమిక పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS