సల్మాన్ ఖాన్‌కీ, మెగా ఫ్యామిలీకీ ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. చిరుతో కంటే.. చరణ్‌తో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాడు సల్మాన్. గాడ్ ఫాదర్ లో కీలకమైన పాత్ర చేయాలని సల్మాన్‌ని సంప్రదించినప్పుడు మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నాడు. అంతే కాదు.. పారితోషికం కూడా తీసుకోలేదు. పారితోషికం ఇస్తానని చెబితే - సెట్లోనే కనిపించనని తెగేసి చెప్పి, మెగా ఫ్యామిలీపై తన ప్రేమని చాటుకొన్నాడు సల్మాన్. గాడ్ ఫాదర్లో సల్మాన్ ఎంట్రీ - నిజంగానే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. ఈ సినిమా మైలేజీ పెంచింది. ఇప్పుడు.. సల్మాన్ కి తిరిగి ఇవ్వాల్సిన తరుణం వచ్చేసింది.
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా కభీ దివాలీ - కభీ ఈద్ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో వెంకటేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రంలో రామ్ చరణ్ అతిథి పాత్రలో మెరవబోతున్నాడని టాక్. ఓ పాటలో సల్మాన్, వెంకీ, పూజాలతో పాటు చరణ్ స్టెప్పులు వేయబోతున్నాడని తెలుస్తోంది. ఈసారి సల్మాన్ అడిగిన వెంటనే... చరణ్ మరో ఆలోచన లేకుండా ఒప్పుకొన్నాడట. ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ మైలేజీ బాలీవుడ్ వరకూ పాకింది. సల్మాన్ సినిమాలో.. చరణ్ ఎంట్రీ ఇస్తే.. అది సల్మాన్‌కి ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే చరణ్ ఒప్పుకొన్నాడని టాక్. అలా.. సల్మాన్ బాకీని చరణ్ తీర్చేసుకొన్నట్టైంది.