నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తరవాత విడాకులు తీసుకోవడం తెలిసిన విషయాలే. ఇప్పుడు ఎవరి కెరీర్‌లో వాళ్లు స్థిరపడే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎవరికి వారే ఆలోచించుకుంటున్నారు. నాగచైతన్య త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న గాసిప్పులు గట్టిగానే వినిపిస్తున్నాయి. రెండో పెళ్లి సంగతేమో గానీ, ప్రస్తుతానికి ఓ హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నాడని, ఇద్దరూ ప్రేమ పక్షుల్లా తిరుగుతున్నారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ హీరోయిన్ ఎవరో కాదు... శోభిత ధూళిపాళ. గూఢచారి, మేజర్ చిత్రాలలో కథానాయికగా నటించింది శోభిత. గత కొంతకాలంగా చైతూతో క్లోజ్‌గా ఉంటోందట. వీరిద్దరూ కలిసే ఉంటున్నారని, చైతూ శోభితకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని, చైతూ ఇంటికి శోభిత తరచూ వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల శోభిత పుట్టిన రోజు జరుపుకొంది. హైదరాబాద్‌లోని తనకు అత్యంత సన్నిహితులైన వారికి పార్టీ ఇచ్చింది. ఈ పార్టీని హోస్ట్ చేసింది చైతూనే అని టాక్ వినిపిస్తోంది. మేజర్ ప్రమోషన్ల కోసం ఈమధ్య హైదరాబాద్‌కి వచ్చింది శోభిత. ఆ సమయంలో చైతూతోనే ఎక్కువ సమయం గడిపిందని, దాన్ని బట్టి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని స్పష్టం అవుతోందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అది ప్రేమా, లేదంటే స్నేహమా? అనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. ఈ విషయమై ఇద్దరిలో ఒకరు మనసు విప్పాలి. అప్పుడే... ఈ బంధం ఎలాంటిదో అర్థమవుతుంది. సమంతతో విడిపోయిన తరవాత.. చై ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు. జీవిత భాగస్వామికి సంబంధించి ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోవడం కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హీరోయిన్‌తో చనువుగా ఉంటున్నాడంటే మేటర్ సీరియస్ అయ్యే ఉంటుంది. మరి చై ఏం చెబుతాడో చూడాలి.